నేను చచ్చిపోతే.. ఎవరిది బాధ్యత
- నిర్వాహకులపై మెద్వదెవ్ ఆగ్రహం

టోక్యో : ఒలింపిక్స్ జరుగుతున్న టోక్యోలో ఎండలు హడలెత్తిస్తున్నాయి. అరియాకె టెన్నిస్ పార్క్‌లో బుధవారం జరిగిన రెండు మ్యాచ్‌లలో ఇద్దరు ఆటగాళ్లు వడదెబ్బతో మధ్యలోనే నిష్క్రమించడం గమనార్హం. ఎండల కారణంగా మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మార్చాలని నిర్వాహకులను ప్లేయర్లు కోరుతున్నారు. రష్యా ఒలింపిక్ కమిటీ (ఆర్వోసీ) ఆటగాడు మెద్వదెవ్.. సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మ్యాచ్ జరుగుతుండగా అతడు చైర్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు.. ‘నేను యోధున్ని. గేమ్‌ను పూర్తి చేస్తాను. కానీ నేను చచ్చిపోతే..

దానికి నువ్వు బాధ్యత తీసుకుంటావా..?’ అని ప్రశ్నించాడు. తాజా పరిణామాల నేపథ్యంలో ఉదయం 11 గంటలకు (జపాన్ కాలమానం ప్రకారం) మొదలు కావాల్సిన మ్యాచ్‌లు గురువారం నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభంకానున్నాయి.
మొమోటాకు షాక్

టోక్యో: ప్రపంచ నంబర్‌వన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కెంటో మొమోటాకు సొంతగడ్డపై షాక్ ఎదురైంది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ గ్రూప్-ఏ మ్యాచ్‌లో మొమోటా 15-21, 19-21 తేడాతో 38వ ర్యాంకర్ హియో క్వాంగీ (దక్షిణకొరియా) చేతిలో అనూహ్య ఓటమి చవిచూశాడు. గ్రూప్‌లో తొలి మ్యాచ్ గెలిచిన మొమోటా ఈ పోటీలో ఓడి విశ్వక్రీడల నుంచి నిరాశగా నిష్క్రమించాడు. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకున్న జపాన్ స్టార్ మొమోటా ఫేవరెట్‌గా ఒలింపిక్స్‌లో అడుగుపెట్టినా.. గ్రూప్ దశలోనే వైదొలిగాడు.
అథ్లెట్లకు ఐనాక్స్ బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: భారత అథ్లెట్ల కోసం ప్రముఖ మల్టీప్లెక్స్ ఆపరేటర్ ఐనాక్స్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన భారత అథ్లెట్లకు జీవితాంతం ఉచితంగా సినిమా టికెట్లు ఇస్తామని వెల్లడించింది. అలాగే ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత అథ్లెట్లందరికీ ఏడాది పాటు ఫ్రీగా సినిమా టికెట్లు ఇవ్వనున్నట్టు బుధవారం ట్వీట్ చేసింది. కాగా టోక్యో విశ్వక్రీడల్లో రజతం గెలిచిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానూకు జీవితాంతం పిజ్జాలు ఉచితంగా ఇవ్వనున్నట్టు ఇప్పటికే డొమినోస్ ప్రకటించింది.
ఆల్‌రౌండ్ పోటీకి బైల్స్ దూరం

టోక్యో: అమెరికా స్టార్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ ఆల్‌రౌండ్ పోటీకి దూరమైంది. మానసిక ఒత్తిడి కారణంగా ఇప్పటికే టీమ్ఈవెంట్ ఫైనల్ నుంచి తప్పుకున్న బైల్స్..తాజాగా గురువారం జరిగే పోటీల నుంచి కూడ తప్పుకుంది. ప్రస్తుతం తన మానసిక పరిస్థితి సరిగ్గా లేదని..కుదుటపడే వరకు పోటీలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు పేర్కొంది. ఈ కారణంగా అర్హత పోటీల్లో తొమ్మిదో స్థానంలో నిలిచిన జేడ్ క్యారీ..బైల్స్ స్థానంలో బరిలోకి దిగనుంది. ఇదిలా ఉంటే బుధవారం పురుషుల ఆల్‌రౌండ్ ఫైనల్స్‌కు సహచర అమెరికా జిమ్నాస్ట్‌లతో కలిసి బైల్స్ హాజరైంది. పోటీలకు దూరంగా ఉంటూ అమెరికా పతక అవకాశాలను ఒక రకంగా దెబ్బతీస్తున్న బైల్స్‌పై కొందరు అసభ్యకరరీతిలో ప్రవరిస్తున్నారు.
తన రికార్డు తానే బద్దలు కొట్టి

రెండేండ్ల క్రితం తాను నెలకొల్పిన ప్రపంచ రికార్డును చైనా వెయిట్‌లిఫ్టర్ షి జియాంగ్.. తాజాగా టోక్యో ఒలింపిక్స్‌లో బద్దలు కొట్టాడు. బుధవారం జరిగిన పురుషుల 73కిలోల విభాగంలో జియాంగ్ 364కిలోల బరువు ఎత్తాడు. స్నాచ్‌లో 166కిలోల బరువు ఎత్తిన ఈ చైనా లిఫ్టర్.. క్లీన్ అండ్ జర్క్‌లో 198కిలోలు పైకి ఎత్తాడు. మొత్తంగా ఇది వరకు తన పేరిట ఉన్న రికార్డు(363కిలోలు)ను జియాంగ్ సవరించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

