న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా జాతీయ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ మరో పతకం చేజిక్కించుకుంది. ఆదివారం జరిగిన 800 మీటర్ల ఫ్రీ ైస్టెల్ విభాగంలో వ్రితి 9 నిమిషాల 22.40 సెకండ్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచింది. స్విమ్మింగ్లో విశేష ప్రతిభ కనబరుస్తున్న వ్రితి రెండు రోజుల వ్యవధిలో రెండు అంతర్జాతీయ పతకాలు తన ఖాతాలో వేసుకోవడం విశేషం.