చెన్నై: ప్రైమ్ వాలీబాల్ లీగ్ మూడో సీజన్లో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ మూడో పరాజయం మూటగట్టుకుంది. చెన్నై వేదికగా సోమవారం హోరాహోరీగా సాగిన పోరులో హైదరాబాద్ 11-15, 15-13, 9-15, 11-15తో ఢిల్లీ తూఫాన్స్ చేతిలో ఓడింది. తాజా సీజన్లో ఢిల్లీకి ఇది రెండో విజయం కాగా.. సంతోష్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. తొలి సెట్ కోల్పోయిన హైదరాబాద్.. రెండో సెట్లో సత్తాచాటి స్కోర్లు సమం చేసినా.. ఆ తర్వాత ఢిల్లీ స్పైకర్లు వరుస స్మాష్‌లతో పాయింట్లు కొల్లగొట్టి మ్యాచ్‌ను వశం చేసుకున్నారు.