Vijay Deverakonda | శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 11: తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలకితీసి వారిని పొత్రహించేందుకు హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఓ వేదికగా నిలుస్తుందని ప్రముఖ చలనచిత్ర నటుడు, హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టు సహా యజమాని విజయ్ దేవరకొండ అన్నాడు. గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో ఆదివారం హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టు నూతన జెర్సీని యజమాని అబిషేక్ రెడ్డితో కలిసి విజయ్ అవిష్కరించాడు.
ఈ సందర్భంగా రంగారెడ్డి, నెల్లూరు జిల్లాల మద్య నిర్వహంచిన ఒపెన్ మ్యాచ్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. తనకు వాలీబాల్ అంటే చిన్నతనం నుంచి చాల ఇష్టమని, అనంతపురం పుట్టపర్తిలో చదువుకునే రోజుల్లో అక్కడి గ్రామీణులతో కలిసి వాలీబాల్ అడేవాడినని అన్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో వాలీబాల్‌కు మంచి గుర్తింపు ఉందని.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు హైదరాబాద్ బ్లాక్ హాక్స్ సహాయపడుతుందని అన్నారు.