హైదరాబాద్ థ్రిల్లింగ్ విక్టరీ
సొంతగడ్డపై హైదరాబాద్ థ్రిల్లింగ్ విక్టరీతో అదరగొట్టింది. రంజీ ట్రోఫీ తాజా సీజన్లో ఆడిన నాలుగో మ్యాచ్ (హోంగ్రౌండ్లో మూడోది)లో ఛత్తీస్‌గఢ్‌ను ఒక్క వికెట్ తేడాతో ఓడించి సంచలన విజయాన్ని నమోదుచేసింది. 259 పరుగుల ఛేదనలో భాగంగా ఆఖరి రోజు ఓవర్ నైట్ స్కోరు 13/2తో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్.. 79.4 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.
- ఒక్క వికెట్ తేడాతో ఛత్తీస్‌గఢ్‌పై విజయం
- ఉత్కంఠ పోరులో గెలిపించిన అనికేత్
హైదరాబాద్, ఆట ప్రతినిధి: సొంతగడ్డపై హైదరాబాద్ థ్రిల్లింగ్ విక్టరీతో అదరగొట్టింది. రంజీ ట్రోఫీ తాజా సీజన్లో ఆడిన నాలుగో మ్యాచ్ (హోంగ్రౌండ్లో మూడోది)లో ఛత్తీస్‌గఢ్‌ను ఒక్క వికెట్ తేడాతో ఓడించి సంచలన విజయాన్ని నమోదుచేసింది. 259 పరుగుల ఛేదనలో భాగంగా ఆఖరి రోజు ఓవర్ నైట్ స్కోరు 13/2తో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్.. 79.4 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఓవర్ నైట్ బ్యాటర్లు అభిరాథ్ (68), రాహుల్ రాధేశ్ (39) మూడో వికెట్‌కు 89 రన్స్ జోడించి గెలుపు బాట వేశారు. మిడిలార్డర్లో వరుణ్ (55) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే రాహుల్ నిష్క్రమించాక హిమతేజ (8), అభిరాథ్, ప్రజ్ఞాన్ (1)తో పాటు కెప్టెన్ మిలింద్ (22) సైతం ఔటవడంతో హైదరాబాద్ 182/7తో నిలిచింది.
కానీ వరుణ్.. లోయరార్డర్ బ్యాటర్ల అండతో జట్టును విజయానికి చేరువ చేసి 220 రన్స్ వద్ద తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో ’ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అనికేత్ (39 నాటౌట్), రక్షణ్ (15 నాటౌట్) సాయంతో జట్టును గెలిపించాడు. మ్యాచ్‌లో బంతితో ప్రత్యర్థిని కట్టడిచేసిన ఈ జోడీ.. లక్ష్యఛేదనలో తీవ్ర ఒత్తిడి ఉన్నా సంయమనంతో ఆడటమే గాక ఆఖరి వికెట్‌కు 104 బంతుల్లో 39 రన్స్ జతచేసి జట్టుకు ఉత్కంఠ విజయాన్ని అందించింది. ఈ గెలుపుతో హైదరాబాద్ ఎలైట్ గ్రూప్-బీలో ఆడిన 4 మ్యాచుల్లో 3 గెలుచుకుని 20 పాయింట్లతో అగ్రస్థానాన కొనసాగుతోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

