IPL 2023 | ఐపీఎల్ వేలంలో రూ.11.5 కోట్ల నుంచి 50 లక్షలకు పడిపోయిన ఉనాద్కత్
2018లో రూ.11.5 కోట్లకు అమ్ముడుపోయిన ఉనాద్కత్
IPL 2023 : ఐపీఎల్ 2023 వేలంలో భారత ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనాద్కత్ అతి తక్కువ ధరకు అమ్ముడుపోయాడు. లక్నో సూపర్ జెయింట్స్ అతడిని రూ.50 లక్షలకు దక్కించుకుంది. దేశవాళీ క్రికెట్లో స్టార్ బౌలర్ అయిన ఉనాద్కత్ 2018 తర్వాత ఇంత తక్కువ ధరకు అమ్ముడుపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 2018లో అతడిని రాజస్థాన్ రాయల్స్ రూ.11.5 కోట్లకు కొన్నది. అయితే, ఆ సీజన్లో అతను పెద్దగా ఆకట్టుకోలేదు. అయినా కూడా 2019లో అతడిని 8.4 కోట్లకు మళ్లీ కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2020, 21లో రూ. 3 కోట్లకు ఉనాద్కత్‌ను రాజస్థాన్ రాయల్స్ అట్టిపెట్టకుంది. పోయిన సీజన్ వేలంలో ఉనాద్కత్‌ను ముంబై ఇండియన్స్ 1.3 కోట్లకు సొంతం చేసుకుంది.
ఉనాద్కత్ 2010లో కేకేఆర్ తరఫున ఐపీఎల్లో ఆరంగ్రేటం చేశాడు. అయితే.. అతని ఐపీఎల్ కెరీర్ మలుపు తిరిగింది మాత్రం 2017లో. ఆ సీజన్లో పూణె సూపర్ జెయింట్స్‌కు ఆడిన ఉనాద్కత్ 12 మ్యాచుల్లోనే 24 వికెట్లు తీశాడు. దాంతో తర్వాతి సీజన్లో అతడిని సొంతం చేసుకునేందుకు రాజస్థాన్ రాయల్స్ రూ.11.5 పెట్టింది. దేశవాళీ టోర్నీల్లో సౌరాష్ట్ర తరఫున ఉనాద్కత్ అద్భుత ప్రదర్శన చేశాడు. దాంతో 12 ఏళ్ల తర్వాత మళ్లీ అతడికి భారత టెస్టు జట్టులో చోటు దక్కింది. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఉనాద్కత్ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

