పూర్వవైభవానికై..

ఒకప్పుడు భారత పురుషుల హాకీ జట్టు విశ్వక్రీడల బరిలో దిగుతుందంటే..మిగిలిన దేశాలన్నీ రెండో స్థానం కోసమే పోటీపడేవి. భారత్‌పై గెలువాలనే ఆలోచన కాదు కదా.. భారీ తేడాతో ఓడకపోతే అంతే చాలు అన్న చందంగా ఉండేది ఇతర జట్ల ఆటతీరు. 1928 నుంచి 1956 ఒలింపిక్స్ వరకు వరుసగా ఆరు స్వర్ణాలతో సిక్సర్ కొట్టిన భారత్.. ఆ తర్వాత కూడా మంచి ప్రదర్శనే చేసింది. అయితే 1980 మాస్కో క్రీడల్లో పసిడి పట్టాక మన వాళ్ల ప్రభ మసకబారింది. నాలుగు దశాబ్దాలుగా మరో మెడల్ కోసం ఎదురుచూస్తున్న భారత్.. ఈ సారి భారీ అంచనాల మధ్య విశ్వక్రీడల్లో అడుగు పెడుతున్నది. మనవాళ్లు మరోసారి స్వర్ణయుగం వైపు అడుగులు వేయాలని ఆశిస్తూ.. మన హాకీ జట్లపై ప్రత్యేక కథనం..
సుదీర్ఘ ఒలింపిక్ చరిత్రలో ఇప్పటి వరకు భారత్ 28 పతకాలు ఖాతాలో వేసుకుంటే.. అందులో సింహభాగం జాతీయ క్రీడ హాకీలో దక్కినవే. మొత్తంగా మన హాకీ వీరులు ఒలింపిక్స్‌లో 11 పతకాలు కొల్లగొట్టగా.. అందులో 8 స్వర్ణాలు, ఒక రజతం, రెండు కాంస్యాలు ఉన్నాయి. 1980 మాస్కో ఒలింపిక్స్ తర్వాత మసకబారిన మన ప్రభకు తిరిగి మెరుగులు అద్దేందుకు మన్‌ప్రీత్ సేన టోక్యో బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నది. 41 ఏండ్ల పతక కరువు తీర్చేందుకు మనవాళ్లకు ఈ సారి మెరుగైన అవకాశాలు కనిపిస్తున్నాయి. రియో (2016) ఒలింపిక్స్‌లో 8వ స్థానంలో నిలిచి నిరాశ పరిచిన పురుషుల జట్టు.. ప్రస్తుతం ప్రపంచ 4వ ర్యాంక్‌తో మంచి జోరుమీద ఉంది. ‘టార్గెట్-టోక్యో’ లక్ష్యంగా గత మూడేండ్లుగా తీవ్రంగా శ్రమిస్తున్న మన్‌ప్రీత్ సేన.. ఇటీవలి కాలంలో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నది. అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్లు సమపాళ్లలో ఉన్న భారత్.. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, స్పెయిన్, న్యూజిలాండ్, జపాన్‌తో కలిసి గ్రూప్-ఏలో పోటీ పడనుంది.
మహిళలకూ మంచి చాన్స్..
మూడోసారి విశ్వక్రీడల బరిలో దిగుతున్న భారత మహిళల జట్టు మునుపెన్నడూ లేనంత పటిష్ఠంగా కనిపిస్తున్నది. యూరోపియన్ జట్లకు దీటుగా శారీరక సామర్థ్యాన్ని పెంపొందించుకున్న మన అమ్మాయిలు మానసికంగానూ బలంగా కనిపిస్తున్నారు. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో తొలిసారి ఆడిన భారత మహిళల జట్టు 36 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత గత విశ్వక్రీడలకు అర్హత సాధించింది. 2018 ఆసియా క్రీడల్లో రజతం సాధించిన మన అమ్మాయిలు.. కామన్వెల్త్, ప్రపంచకప్‌లలోనూ మంచి ప్రదర్శన కనబర్చారు. కెప్టెన్ రాణి రాంపాల్ జట్టుకు ప్రధాన బలం కాగా.. వందన, దీప్గ్రేస్ఎక్కా, సవిత కీలకం కానున్నారు. శనివారం నెదర్లాండ్స్‌తో పోరు ద్వారా మన అమ్మాయిల పతక వేట ప్రారంభం కానుంది.
హాకీ జట్లు
పురుషులు: హర్మన్‌ప్రీత్ సింగ్, రూపిందర్ సింగ్, సురేందర్, అమిత్, బిరేంద్ర (డిఫెండర్లు), హార్దిక్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్ (కెప్టెన్), వివేక్ సాగర్, నీలకంఠ, సుమిత్ (మిడ్‌ఫీల్డర్లు), షంషేర్, దిల్‌ప్రీత్ సింగ్, గుర్జాంత్, లలిత్, మన్దీప్ (ఫార్వర్డ్), పీఆర్ శ్రీజేశ్ (గోల్ కీపర్).
మహిళలు: గుర్జిత్ కౌర్, దీప్ గ్రేస్ ఎక్కా, నిక్కీ ప్రధాన్, ఉదిత (డిఫెండర్లు), మోనిక, నిశ, సుశీల, నవ్‌జోత్, సలీమ, నేహ (మిడ్‌ఫీల్డర్లు), రాణి రాంపాల్ (కెప్టెన్), షర్మిల, వందన, లాల్రెమ్సియామి, నవ్‌నీత్ (ఫార్వర్డ్), సవిత (గోల్ కీపర్).
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Hockey captains
- Manpreet
- Rani
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

