MI vs GG : ముంబై ఆల్‌రౌండర్ మాథ్యూస్ (Hayley Matthews) దెబ్బకు గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants) మూడో వికెట్ కోల్పోయింది. ఆరో ఓవర్ ఆఖరి బంతికి అనబెల్ సథర్లాండ్ (0 ఎల్బీగా ఔట్ అయింది. రెండో బంతికి ఓపెనర్ సబ్బినేని మేఘన (16)ను మాథ్యూస్ ఔట్ చేసింది. మాథ్యూస్ ఓవర్లో లాంగాఫ్‌లో భారీ షాట్ ఆడింది. అమేలియా కేర్ బౌండరీ వద్ద క్యాచ్ పట్టడంతో మేఘన పెవిలియన్ బాట పట్టింది. క్రీజులోకి వచ్చింది. హర్లీన్ డియోల్(16)తో కలిసి మేఘన రెండో వికెట్‌కు 34 రన్స్ జోడించింది. ఇసీ వాంగ్ వేసిన ఐదో ఓవర్లో హర్లీన్ వరుసగా రెండు బౌండరీలు బాదింది.
163 టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు తొలి ఓవర్ మొదటి బంతికే షాక్ తగిలింది. ఓపెనర్ సోఫీ డంక్లే(0)ను నాట్ సీవర్ బ్రంట్ ఎల్బీగా ఔట్ చేసింది.