ఢిల్లీ: ఐపీఎల్లో గాయం కారణంగా జట్టుకు దూరమైన స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా నాలుగు నెలల విరామం తర్వాత టీమిండియాలోకి పునరాగమనం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అక్టోబర్లో ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరుగబోయే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు గాను బీసీసీఐ అతడికి భారత-ఏ జట్టులోకి తీసుకుంది. అయితే ఈ సిరీస్కు ముందు ఫిట్నెస్ నిరూపించుకుంటేనే అతడు బరిలోకి దిగే అవకాశముంది.