Hardik Pandya: హార్ధిక్ పాండ్యా రీఎంట్రీ అప్పుడేనా..?
Hardik Pandya: వరల్డ్ కప్‌లో సగం టోర్నీ నుంచే తప్పుకున్న పాండ్యా.. గురువారం నుంచి ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌తో పాటు సౌతాఫ్రికా టూర్‌కు దూరంగా ఉండనున్నాడు. అయితే అతడు తిరిగి గ్రౌండ్లోకి వచ్చేది..
Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా ఇటీవలే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఆడుతూ గాయపడి టోర్నీ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. వరల్డ్ కప్‌లో సగం టోర్నీ నుంచే తప్పుకున్న పాండ్యా.. గురువారం నుంచి ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌తో పాటు సౌతాఫ్రికా టూర్‌కు దూరంగా ఉండనున్నాడు. అయితే అతడు తిరిగి గ్రౌండ్లోకి వచ్చేది మార్చి మాసాంతంలోనే అని తెలుస్తున్నది. టీ20లలో భారత జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న హార్ధిక్ పాండ్యా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లోనే తిరిగి రానున్నట్టు సమాచారం.
భారత జట్టు త్వరలోనే ఆసీస్‌తో టీ20 సిరీస్ ముగిసిన వెంటనే దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఆ తర్వాత జనవరిలో స్వదేశంలో అఫ్గాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్.. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. కానీ హార్ధిక్ మాత్రం నేరుగా ఐపీఎల్‌లోనే ఆడనున్నట్టు తెలుస్తున్నది.
Hardik Pandya likely to make his return in IPL 2024. (TOI). pic.twitter.com/ljdVBFDJC8
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 22, 2023
ఎడమ కాలి మడమ గాయంతో బాధపడుతున్న హార్ధిక్.. వరల్డ్ కప్ నాకౌట్ దశకు ముందే వైదొలిగాడు. అతడు ఆసీస్‌తో సిరీస్ వరకు కోలుకుంటాడని భావించినా అదీ జరగలేదు. పాండ్యాకు మరింత విశ్రాంతి అవసరమని, వచ్చే ఏడాది జూన్‌లో భారత జట్టు టీ20 వరల్డ్ కప్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో పాండ్యాను మధ్యలో ఆడించి గాయాన్ని పెద్దది చేసేదానికంటే ప్రస్తుతానికి అతడికి విరామమిచ్చిందే బెటర్ అన్న యోచనలో బీసీసీఐ ఉన్నట్టు తెలుస్తోంది. ఎలాగూ మార్చి మాసాంతంలో ఐపీఎల్ ప్రారంభం కానుండటంతో ఈ లీగ్‌లో ఫామ్ అందుకుని ప్రపంచకప్‌కు నేరుగా బరిలోకి దిగొచ్చని హార్ధిక్ భావిస్తున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

