MI vs LSG | ముంబై కెప్టెన్గా సూర్య.. లక్నో జట్టులో విధ్వంసక ఆటగాడు..!
MI vs LSG : పంతొమ్మిదో సీజన్లో అట్టడుగునున్న ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ అమీతుమీకి సిద్ధమయ్యాయి. టాస్ గెలిచిన సూర్య బౌలింగ్ ఎంచుకున్నాడు.
MI vs LSG : పంతొమ్మిదో సీజన్లో అట్టడుగునున్న ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ అమీతుమీకి సిద్ధమయ్యాయి. ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించిన ఈ రెండు జట్లు విజయంతో పైకి ఎగబాకాలనే కసితో ఉన్నాయి. వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ముంబై సారథిగా సూర్యకుమార్ యాదవ్ టాస్కు వచ్చాడు. టాస్ గెలిచిన సూర్య బౌలింగ్ ఎంచుకున్నాడు.
ప్లే ఆఫ్స్ రేసులో లేని ముంబై, లక్నో మూడో విజయంపై కన్నేశాయి. హార్దిక్ పాండ్యా స్థానంలో టాస్కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్.. అనారోగ్యంతో పాండ్యా మ్యాచ్ ఆడడం లేదని తెలిపాడు. రెండు మార్పులతో ఆడుతున్నామని చెప్పిన సూర్య.. రోహిత్, కార్బిన్ బాస్చ్ తుది జట్టులో వచ్చారని వెల్లడించాడు. లక్నో విషయానికొస్తే.. మిచెల్ మార్ష్ చేతుల మీదుగా జోష్ ఇంగ్లిస్ డెబ్యూట్ క్యాప్ అందుకున్నాడు. ముకుల్ బదులు రఘువంశీని ఆడిస్తున్నట్టు కెప్టెన్ పంత్ చెప్పాడు.
🚨 Toss Update 🚨@mipaltan won the toss and elected to field against @LucknowIPL.
Surya Kumar Yadav is captaining #MI as Hardik Panyda is unwell.
Updates ▶️https://t.co/elXSOvaeig #TATAIPL | #KhelBindaas | #MIvLSG pic.twitter.com/eQjzr2GXrm
— IndianPremierLeague (@IPL) May 4, 2026
ముంబై తుది జట్టు : రికెల్టన్(వికెట్ కీపర్), నమన్ ధిర్, సూర్యకుమార్(కెప్టెన్), తిలక్ వర్మ, విల్ జాక్స్, రాజ్ బవ, కార్బిన్ బాస్చ్, దీపక్ చాహర్, బుమ్రా, గజన్ఫర్, రఘు శర్మ.
ఇంప్యాక్ట్ సబ్స్ – రోహిత్ శర్మ, మయాంక్ రావత్, రాబిన్ మిన్జ్, శార్ధూల్ ఠాకూర్, బౌల్ట్.
లక్నో తుది జట్టు : మిచెల్ మార్ష్, మర్క్రమ్, రిషభ్ పంత్(కెప్టెన్), ఇంగ్లిస్, పూరన్, అక్షత్ రఘువంశీ, హిమ్మత్ సింగ్, షమీ, మొహ్సిన్ ఖాన్, అవేశ్ ఖాన్, ప్రిన్స్ యాదవ్.
ఇంప్యాక్ట్ సబ్స్ – సిద్ధార్థ్, దిగ్వేశ్ రథీ, మయాంక్ యాదవ్, షహ్బాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

