Harbhajan Singh | రాహుల్ దూకుడుగా ఆడితే ఎక్కువ రన్స్ కొట్టేవాడు : భజ్జీ
తొలి ఇన్నింగ్స్‌లో రాహుల్ దూకుడుగా ఆడి ఉంటే ఎక్కువ పరుగులు చేసేవాడని మాజీ స్పిన్నర్ హర్భజన్ అన్నాడు. 71 బంతులు ఎదుర్కొన్న రాహుల్ 20 రన్స్ చేశాడంతే. రోహిత్‌తో కలిసి అతను మొదటి వికెట్‌కు 76 రన్స్ జోడించాడు.
Harbhajan Singh : నాగ్‌పూర్ టెస్టులో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ తీరును మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తీవ్రంగా విమర్శించాడు. రాహుల్ దూకుడుగా ఆడి ఉంటే ఎక్కువ పరుగులు చేసేవాడని హర్భజన్ అన్నాడు. ‘రాహుల్ క్రీజులో కుదురుకునేందుకు ఎక్కువ టైమ్ తీసుకుంటున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో అతను అటాకింగ్ గేమ్ ఆడితే మరిన్ని రన్స్ చేసేవాడని నా నమ్మకం. సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం వస్తే రాహుల్ రన్స్ చేస్తాడని అనుకుంటున్నా’ అని భజ్జీ తెలిపాడు. అంతేకాదు ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 350 వరకు స్కోర్ చేయాలని అప్పుడు ఆస్ట్రేలియాను 200 లోపే కట్టడి చేయొచ్చని ఈ మాజీ ఆఫ్ స్పిన్నర్ అభిప్రాయ పడ్డాడు. నాగ్‌పూర్ టెస్టులో భజ్జీ 7 వికెట్లు పడగొట్టాడు. దాంతో భారత్ తేడాతో గెలుపొందింది.
71 బంతులు.. 20 రన్స్
తొలి ఇన్నింగ్స్‌లో రాహుల్ 20 రన్స్‌కే వెనుదిరిగి అందర్నీ నిరాశ పరిచాడు. ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌ను కాదని అతడికి అవకాశం ఇచ్చారు. అయితే.. 71 బంతులు ఎదుర్కొన్న అతను 20 రన్స్ చేశాడంతే. మరో ఏడు బంతుల్లో మ్యాచ్ ముగుస్తుంది అనగా మర్ఫీ ఓవర్లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రోహిత్‌తో కలిసి అతను మొదటి వికెట్‌కు 76 రన్స్ జోడించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 177కు ఆలౌట్ అయింది. రవీంద్ర జడేజా 5, అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

