కొత్త అవతారంలో భజ్జీ!

న్యూఢిల్లీ: వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కొత్త అవతారంలో కనిపించబోతున్నాడు. వచ్చే సీజన్ ఐపీఎల్లో ఓ ఫ్రాంచైజీ సహాయ బృందంలో ప్రత్యక్షం కానున్నాడు. మెంటార్‌గా లేక సలహాదారుడిగా వ్యవహరించే అవకాశం ఉంది. ఇప్పటికే అతడితో ఓ ప్రముఖ ఫ్రాంచైజీ సంప్రదింపులు చేస్తున్నదని సమాచారం. ఈ నేపథ్యంలోనే వారంలో భజ్జీ తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్నాడట. ఇటీవల ముగిసిన ఐపీఎల్ మొదటి దశలో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో ఉన్న ఈ సీనియర్ ఆటగాడు మైదానంలోకి మాత్రం దిగలేదు. యూఏఈ వేదికగా జరిగిన రెండో దశలో భజ్జీ కనిపించలేదు. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి కొత్త బాధ్యతలు చేపట్టే యోచనలో ఉన్నాడు. త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. భారత క్రికెట్ జట్టులో కీలక బౌలర్‌గా వ్యహరించిన హర్భజన్ ఐపీఎల్ మెగావేలంలో ఓ ఫ్రాంచేజీకి సహాయం చేయనున్నాడని, ఆ జట్టులోని ఆటగాళ్లకు మెళకువలు నేర్పించబోతున్నాడని వినికిడి. విలువైన సూచనలు చేసి కుర్రాళ్లను ప్రోత్సహించడంలో భజ్జీ ముందుంటాడు. గతేడాది కేకేఆర్‌లో వరుణ్ చక్రవర్తికి చిట్కాలు నేర్పించగా.. నెట్ సెషన్స్‌లో వెంకటేశ్ అయ్యర్‌కు కూడా సలహాలు ఇచ్చాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

