Rahul Tewatia | అంచనాలు నిండా ముంచాయి : నిరాశలో తెవాటియా
Rahul Tewatia | దేశవాళీతో పాటు ఐపీఎల్ లో ఆడే ప్రతి క్రికెటర్ అంతిమ లక్ష్యం జాతీయ జట్టులో చోటు సంపాదించడమే. భారత జట్టులో చోటు దక్కించుకునేందుకు ప్రతి యువ క్రికెటర్ ఐపీఎల్ తో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో టన్నుల కొద్దీ పరుగులు చేస్తుంటారు. తమను తాము నిరూపించుకోవాలని, సెలెక్టర్ల దృష్టిలో పడాలని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో తమ ప్రదర్శనను జనమంతా గుర్తించినా సెలెక్టర్లు మొండిచేయి చూపితే మాత్రం తీవ్ర నిరాశకు గురౌతారు. ప్రస్తుతం రాహుల్ తెవాటియా ఇంచుమించు అదే ఫీలింగ్ లో ఉన్నాడు.
గడిచిన మూడు ఐపీఎల్ సీజన్లలో నిలకడగా రాణిస్తూ ఫినిషర్ గా మెరుపులు మెరిపిస్తున్న తెవాటియా.. ఇటీవలే ముగిసిన 15వ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ కు ఆడాడు. గుజరాత్ తరఫున కీలక మ్యాచులు ఆడిన తెవాటియా.. 12 ఇన్నింగ్స్ లలో 217 రన్స్ చేశాడు. ఫినిషర్ గా వచ్చే తెవాటియా.. స్ట్రైక్ రేట్ 147.62గా ఉంది. గత రెండు సీజన్లలో కూడా రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడిన అంచనాలకు తగ్గట్టే రాణించాడు.
తెవాటియా మెరుపులతో ఈసారి అతడికి టీమిండియా నుంచి పిలుపు రావడం ఖాయమనుకున్నారంతా. కానీ దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగుతున్న టీ20 సిరీస్ తో పాటు ఐర్లాండ్ పర్యటనకు ప్రకటించిన భారత జట్టులో కూడా తెవాటియా పేరు లేదు.
దీంతో అతడు ట్విటర్ వేదికగా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఎమెషనల్ ట్వీట్ చేశాడు. ‘అంచనాలు బాధించాయి..’ అని ట్వీట్ లో పేర్కొన్నాడు. తెవాటియా రెండు పదాల్లో ట్వీట్ చేసినా అతడి బాధ మాత్రం రెండు సీజన్ల శ్రమ కంటే ఎక్కువని ట్విటర్ లో తెవాటియా అభిమానులు వాపోతున్నారు.
ఐర్లాండ్ పర్యటనకు భారత జట్టు : హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్, చహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్
Expectations hurts 😒😒
— Rahul Tewatia (@rahultewatia02) June 15, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

