స్టోక్స్ సూపర్
మెగాటోర్నీ ముగింపు దశకు చేరిన వేళ ఇంగ్లండ్ ఖాతాలో రెండో విజయం చేరింది. బుధవారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 160 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఎనిమిది మ్యాచ్‌ల్లో రెండో విజయంతో ఏకంగా పదో స్థానం నుంచి ఏడుకు ఎగబాకింది.
- నెదర్లాండ్స్‌పై ఇంగ్లండ్ ఘన విజయం
- సెంచరీతో విజృంభణ
- రాణించిన మొయిన్ అలీ, ఆదిల్ రషీద్
హమ్మయ్య! డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ఎట్టకేలకు గెలుపు రుచిచూసింది. సరిగ్గా నెలరోజుల క్రితం బంగ్లాదేశ్‌పై బోణీ కొట్టిన ఇంగ్లండ్..ఆరు ఓటముల తర్వాత నెదర్లాండ్స్‌పై గెలిచింది. బెన్‌స్టోక్స్ సూపర్ సెంచరీకి మలాన్, వోక్స్ అర్ధసెంచరీలు జతకలిసిన వేళ భారీ స్కోరు అందుకున్న బట్లర్ గ్యాంగ్.. డచ్ టీమ్‌ను స్పిన్ ఉచ్చులో బంధించింది. మొయిన్ అలీ, ఆదిల్ రషీద్ విజృంభణతో నెదర్లాండ్స్ 179 పరుగులకే కుప్పకూలి సెమీస్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది.
పుణె: మెగాటోర్నీ ముగింపు దశకు చేరిన వేళ ఇంగ్లండ్ ఖాతాలో రెండో విజయం చేరింది. బుధవారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 160 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఎనిమిది మ్యాచ్‌ల్లో రెండో విజయంతో ఏకంగా పదో స్థానం నుంచి ఏడుకు ఎగబాకింది. దక్షిణాఫ్రికా లాంటి మేటి జట్టును మట్టికరిపించిన డచ్ టీమ్ ఆటలు ఇంగ్లండ్ ముందు సాగలేదు. తొలుత బెన్ స్టోక్స్(84 బంతుల్లో 108, 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) సూపర్ సెంచరీకి తోడు మలాన్(87), క్రిస్ వోక్స్(51) అర్ధసెంచరీలతో ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 339/9 భారీ స్కోరు చేసింది.
బాస్ డీ లిడె(3/74) మూడు వికెట్లు పడగొట్టగా, ఆర్యన్‌దత్, వాన్ బీక్ రెండేసి వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన నెదర్లాండ్స్..అలీ(3/42), రషీద్(3/54) ధాటికి 37.2 ఓవర్లలో 179 పరుగులకు పరిమితమైంది. తేజ(41 నాటౌట్), కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్(38) టాప్ స్కోరర్లుగా నిలిచారు. విల్లే రెండు వికెట్లు తీశాడు. ప్రపంచకప్‌లో తొలి సెంచరీతో జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించిన స్టోక్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఇంగ్లండ్ తమ ఆఖరి మ్యాచ్‌లో ఈనెల 11న పాకిస్థాన్‌తో తలపడనుండగా, 12న నెదర్లాండ్స్..భారత్‌తో ఆడనుంది.
1 ప్రపంచకప్లోస్టోక్స్కు ఇది తొలి సెంచరీ
1ఓవరాల్‌గా వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఇంగ్లండ్ బౌలర్‌గా వోక్స్(30) నిలిచాడు. బోథమ్(30), ఫిల్ డెఫ్రిట్స్(29), అండర్సన్(27) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు.
1వన్డే ప్రపంచకప్ చరిత్రలో ప్రతీ జట్టు రెండేసి మ్యాచ్‌లు గెలువడం ఇదే తొలిసారి
చాంపియన్స్ ట్రోఫీ రేసులో: పాకిస్థాన్ వేదికగా 2025 జరిగే చాంపియన్స్ ట్రోఫీ రేసులో ఇంగ్లండ్ నిలిచింది. నెదర్లాండ్స్‌పై గెలువడం ద్వారా ఇంగ్లండ్ టాప్-7లోకి దూసుకొచ్చింది. మెగాటోర్నీలో టాప్-7లో ఉన్న జట్లు నేరుగా చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధిస్తాయి.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లండ్: 50 ఓవర్లలో(స్టోక్స్ 108, మలాన్ 87, డీ లిడే 3/74, ఆర్యన్ 2/67),
నెదర్లాండ్స్: 37.2 ఓవర్లలో 179 ఆలౌట్(తేజ 41 నాటౌట్, ఎడ్వర్డ్స్ 38, అలీ 3/42, రషీద్ 3/54)

Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

