Glenn Maxwell: మ్యాక్సీ ఊచకోత.. హిట్‌మ్యాన్ రికార్డు సమం..
Glenn Maxwell: వెస్టిండీస్‌తో అడిలైడ్ ఓవల్ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ కరేబియన్లపై తనదైన ఆటతో విరుచుకుపడ్డాడు. 25 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తిచేసిన మ్యాక్సీ.. 50 బంతుల్లో శతకం బాదాడు.
Glenn Maxwell: ఆస్ట్రేలియా విధ్వంసక వీరుడు, మిడిలార్డర్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ మరోసారి బీస్ట్ మోడ్‌లోకి వచ్చాడు. వెస్టిండీస్‌తో అడిలైడ్ ఓవల్ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో ఈ సిక్సర్ల వీరుడు కరేబియన్లపై తనదైన ఆటతో విరుచుకుపడ్డాడు. 25 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తిచేసిన మ్యాక్సీ.. 50 బంతుల్లో శతకం బాదాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 55 బంతులాడిన మ్యాక్స్‌వెల్.. 12 బౌండరీలు, 8 భారీ సిక్సర్ల సాయంతో 120 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
టీ20లలో మ్యాక్సీకి ఇది ఐదో శతకం కావడం గమనార్హం. తద్వారా అతడు అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక శతకాలు చేసిన బ్యాటర్లలో రోహిత్ శర్మతో సమానంగా నిలిచాడు. పొట్టి ఫార్మాట్లో రోహిత్ ఖాతాలోనూ ఐదు శతకాలున్నాయి. ఈ జాబితాలో సూర్యకుమార్ యాదవ్ (4) , కొలిన్ మన్రో (న్యూజిలాండ్ – 3), పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ మూడు సెంచరీలతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Most Hundreds in T20I:
Glenn Maxwell – 5* (94 innings)
Rohit Sharma – 5 (143 innings) pic.twitter.com/38HMakhBJL
— Johns. (@CricCrazyJohns) February 11, 2024
రోహిత్ శర్మ 151 మ్యాచ్‌లలో ఐదు సెంచరీలు చేస్తే మ్యాక్స్‌వెల్ మాత్రం 102 మ్యాచ్‌లలోనే ఈ ఘనతను అందుకోవడం విశేషం. అదీగాక మ్యాక్స్‌వెల్ సెంచరీ చేసిన ప్రతి మ్యాచ్‌లోనూ నాటౌట్‌గా నిలిచాడు. ఇది కూడా ఓ రికార్డే. ఇక మ్యాచ్ విషయానికొస్తే అడిలైడ్‌లో మ్యాక్స్‌వెల్ వీరబాదుడుతో పాటు ఆఖర్లో టిమ్ డేవిడ్ (14 బంతుల్లో 31 నాటౌట్, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరవిహారంతో ఆసీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ స్కోరుచేసింది.
టీ20లలో మ్యాక్స్‌వెల్ సెంచరీల వివరాలు:
1. 2016లో శ్రీలంకపై 145 నాటౌట్
2. 2018లో ఇంగ్లండ్‌పై 103 నాటౌట్
3. 2019లో ఇండియాపై 113 నాటౌట్
4. 2023లో ఇండియాపై 104 నాటౌట్
5. 2024లో వెస్టిండీస్‌పై 120 నాటౌట్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
‘ఎంజీయూలో అధ్యాపకుల కొరతపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు’
Medicover Hospitals | మెడికవర్ మరణాలపై ప్రశ్నిస్తే జర్నలిస్టు శంకర్‌పై కేసు..
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

