ఢిల్లీ: మ్యాక్స్‌వెల్(Glenn Maxwell) మోత మోగించాడు. క్రికెట్ హిస్టరీలో కొత్త చరిత్ర సృష్టించాడు. వరల్డ్‌కప్‌లో అత్యంత వేగంగా సెంచరీ కొట్టిన బ్యాటర్‌గా నిలిచాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ విశ్వరూపం చూపాడు. ఇటీవల పేలవ ఫామ్‌లో ఉన్న మ్యాక్సీ.. ఒక్కసారిగా జూలు విదిల్చాడు. నెదర్లాండ్స్ బౌలర్లతో ఆటాడుకున్నాడు. కేవలం 40 బంతుల్లోనే వంద రన్స్ చేసి కొత్త రికార్డును నెలకొల్పాడు. మ్యాక్సీ 44 బంతుల్లో 106 రన్స్ చేసి ఔటయ్యాడు. మ్యాక్స్‌వెల్ తన పవర్ హిట్టింగ్తో కేక పుట్టించాడు. 8 సిక్సర్లు, 9 ఫోర్లతో ఊచకోత కోశాడు. మ్యాక్స్‌వెల్ స్ట్రోక్ ప్లేకు చెందిన వీడియోలు వీక్షించండి.