IPL 2023 | శుభ్‌మన్, సాహా తుఫాన్ ఇన్నింగ్స్.. లక్నోపై గుజరాత్ భారీ విజయం
IPL 2023 : డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణిస్తూ ప్రత్యర్థి జట్లను హడలెత్తిస్తోంది. సొంత గ్రౌండ్లో భారీ స్కోర్ చేసిన హార్దిక్ పాండ్యా సేన వరుసగా రెండో విజయం సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్‌పై 56 పరగుల తేడాతో గెలిచింది.
IPL 2023 : డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణిస్తూ ప్రత్యర్థి జట్లను హడలెత్తిస్తోంది. సొంత గ్రౌండ్లో భారీ స్కోర్ చేసిన హార్దిక్ పాండ్యా సేన వరుసగా రెండో విజయం సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్‌పై 56 పరగుల తేడాతో గెలిచింది. తొలుత ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(94 నాటౌట్ 51 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లు), వృద్ధిమాన్ సాహా(81 43 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) వీరవిహారం చేయడంతో లక్నోకు 227 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్నో బ్యాటర్లలో క్వింటన్ డికాక్(70), కైల్ మేయర్స్(48) మాత్రమే రాణించారు.
కొండంత లక్ష్య ఛేదనలో లక్నోకు ఓపెనర్లు కైల్ మేయర్స్(44), క్వింటన్ డికాక్(24) శుభారంభం ఇచ్చారు. పవర్ ప్లేలో ధనాధన్ ఆడి 72 పరుగులు సాధించారు. అయితే.. మోహిత్ శర్మ ఓవర్లో రషీద్ ఖాన్ అద్భుత క్యాచ్‌తో మేయర్స్‌ను పెవిలియన్ పంపాడు. అక్కడితో లక్నో స్కోర్ నెమ్మదించింది. దీపక్ హుడా(11), స్టోయినిస్(4) విఫలమయ్యారు. ఆఖర్లో ఆదుకుంటాడనుకున్న నికోలస్ పూరన్(3) చేతులెత్తేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్ ఆయుష్ బదొని(21) చివర్లో ధాటిగా ఆడాడు. దాంతో లక్నో 171 పరుగులకే పరిమితమైంది. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ నాలుగు, షమీ, నూర్ అహ్మద్, రషీద్ ఖాన్ తలా ఒక వికెట్ తీశారు.
ఉతికారేసిన శుభ్‌మన్, సాహా
గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా(81), శుభ్‌మన్ గిల్(94 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగారు. డేవిడ్ మిల్లర్(21 నాటౌట్) కూడా ధనాధన్ ఆడడంతో గుజరాత్ 2 వికెట్ల నష్టానికి 227 పరుగులు కొట్టింది. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లను ఉతికారేసిన సాహా, గిల్ తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 142 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని అవేశ్‌ఖాన్ విడదీశాడు. సాహా ఔటయ్యాక గిల్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా(10) ధాటిగా ఆడారు. పాండ్యా తర్వాత వచ్చిన మిల్లర్ మెరపు ఇన్నింగ్స్ ఆడాడు. లక్నో బౌలర్లలో అవేశ్ ఖాన్, మొహ్సిన్ ఖాన్ చెరొక వికెట్ తీశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

