Germanay Football Team | జపాన్ చేతిలో దారుణ ఓటమి.. హెడ్‌కోచ్‌ను తొలగించిన జర్మనీ
Germanay Football Team : మాజీ వరల్డ్ చాంపియన్ జర్మనీ ఫుట్‌బాల్ జట్టు(Germanay Football Team) ఈ మధ్య పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తోంది. ఫ్రెండ్లీ మ్యాచ్‌లో ఈరోజు జపాన్(Japan) చేతిలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆసియా జట్టు...
Germanay Football Team : మాజీ వరల్డ్ చాంపియన్ జర్మనీ ఫుట్‌బాల్ జట్టు(Germanay Football Team) ఈ మధ్య పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తోంది. ఫ్రెండ్లీ మ్యాచ్‌లో ఈరోజు జపాన్(Japan) చేతిలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆసియా జట్టు 4-1తో జర్మనీని చిత్తు చేసింది. దాంతో, ఆగ్రహించిన ఆ దేశ ఫుట్‌బాల్ సంఘం హెడ్‌కోచ్‌గా ఉన్న హన్సీ ఫ్లిక్(Hansi Flick)ను తొలగించింది.
అంతేకాదు ప్రస్తుతం టీమ్ డైరెక్టర్‌గా ఉన్న రుడి విల్లర్, మిగతా ముగ్గురు కోచ్‌లకు తర్వాతి మ్యాచ్‌లను చూసుకొనే బాధ్యత అప్పగించింది. వచ్చే ఏడాది యూరోపియన్ చాంపియన్‌షిప్(European Championship) పోటీలకు జర్మనీ ఆతిథ్యం ఇవ్వనుంది. అందుకని ఈ ఓటమిని ఆ దేశ ఫుట్‌బాల్ సంఘం సీరియస్‌గా తీసుకుంది.
జపాన్ చేతిలో ఓటమి అనంతరం నిరాశలో జర్మనీ ఆటగాళ్లు

నిరుడు ఖతర్‌లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్(fifa world cup 2022)లోనూ జర్మనీ గ్రూప్ దశ దాటలేకపోయింది. అప్పటి నుంచి ఆ జట్టు ఆట మరింత తీసికట్టుగా మారింది. దాంతో, కోచింగ్ సిబ్బందిని మార్చాలనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే హన్సీ ఫ్లిక్పై వేటు పడినట్టు తెలుస్తోంది. కోచ్‌గా సుదీర్ఘ అనుభవం ఉన్న హన్సీ 2020లో బయెర్న్ మ్యునిచ్ జట్టను చాంపియన్స్ లీగ్ విజేతగా నిలిపాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

