Gareth Bale : వేల్స్ జట్టు కెప్టెన్ గరెథ్ బాలె సాకర్‌కు వీడ్కోలు పలికాడు. 33 ఏళ్ల వయసులోనే ఆటకు గుడ్ బై చెప్పేశాడు. ఇతను ఖతర్‌లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్‌లో వేల్స్ జట్టు కెప్టెన్. ‘నాకు ఎంతో ఇష్టమైన ఆటను ఆడి కలను నిజం చేసుకున్నందుకు నేను చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నా. ఎంతో ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నా. క్లబ్, అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుంచి సెలవు తీసుకుంటున్నా’ అని గరెథ్ అన్నాడు. ఈ సందర్భంగా అతను ఆటతో, వేల్స్ జట్టుతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘సౌతాంప్టన్‌తో ఆరంగ్రేటం నుంచి లాస్ ఏంజెల్స్ ఫుట్‌బాల్ క్లబ్ వరకు నా క్లబ్ కెరీర్ కొనసాగింది. జాతీయ జట్టుకు 111 మ్యాచుల్లో ప్రాతినిధ్యం వహించడంతో నా కల నిజమైంది. ఈ జర్నీలో నాకు మద్దుతగా నిలిచిన తోటి ఆటగాళ్లు, క్లబ్‌లకు ధన్యవాదాలు’ అని ఈ స్టార్ ఆటగాడు తన వీడ్కోలు సందేశంలో తెలిపాడు.
గరెథ్ సాంతాప్టన్, టొటెన్హమ్, హాట్స్పుర్, రియల్ మాడ్రిడ్, లాంస్ ఏంజెల్స్ క్లబ్స్ తరఫున ఆడాడు. ఫిఫా వరల్డ్ కప్‌లో గ్రూప్ బిలో ఉన్న వేల్స్ . ఇంగ్లండ్ చేతిలో 3-0తో ఓడిపోయింది. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 1-1తో డ్రాగా ముగిసింది. దాంతో ఆ జట్టు టోర్నీ మధ్యలోనే నిష్క్రమించింది
— Gareth Bale (@GarethBale11) January 9, 2023