ఆల్మటీ: ప్రతిష్ఠాత్మక షూటింగ్ ప్రపంచకప్‌లో భారత యువ షూటర్ గనేమత్ షెకాన్ రజత పతకం కైవసం చేసుకుంది. కజకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్‌కప్ రెండో రోజు మంగళవారం గనేమత్తో పాటు స్కీట్ విభాగంలో దర్శన కాంస్య పతకం చేజిక్కించుకుంది.
మహిళల స్కీట్ ఫైనల్లో గనేమత్, అసీమ్ (కజకిస్థాన్) హోరాహోరీగా తలపడగా.. స్వల్ప తేడాతో భారత షూటర్ రజతానికి పరిమితమైంది. మహిళల స్కీట్ విభాగంలో మరో భారత షూటర్ మహేశ్వరి 24వ స్థానంతో సరిపెట్టుకుంది. పురుషుల స్కీట్ ఈవెంట్లో మిరాజ్ ఖాన్, గుర్జ్యోత్, అనంత్‌జీత్ సింగ్ ఆకట్టుకోలేకపోయారు.