గనెమత్కు పతకం ఖాయం
ఐఎస్ఎఫ్ఎఫ్ ప్రపంచకప్ షూటింగ్ పోటీలలో యువ షూటర్ గనెమత్ షెకాన్ స్కీట్ విభాగంలో రెండో స్థానంలో నిలిచి భారత పతక ఆశలను సజీవంగా నిలిపింది. కాగా పురుషుల 10మీ. ఎయిర్ రైఫిల్ క్వాలిఫికేషన్ పోటీలలో హృదయ్ హజారిక, మహిళల 10మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో ఎలవెనిల్ వలరివన్ ఏడో స్థానంలో నిలిచి నిరాశపరిచారు.
దోహా : ఐఎస్ఎఫ్ఎఫ్ ప్రపంచకప్ షూటింగ్ పోటీలలో యువ షూటర్ గనెమత్ షెకాన్ స్కీట్ విభాగంలో రెండో స్థానంలో నిలిచి భారత పతక ఆశలను సజీవంగా నిలిపింది. కాగా పురుషుల 10మీ. ఎయిర్ రైఫిల్ క్వాలిఫికేషన్ పోటీలలో హృదయ్ హజారిక, మహిళల 10మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో ఎలవెనిల్ వలరివన్ ఏడో స్థానంలో నిలిచి నిరాశపరిచారు. స్కీట్‌లో గనెమత్ మూడు రౌండర్లలో 24/25 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. కజకస్థాన్కు చెందిన అస్సెమ్ ఒరిన్బే అగ్రస్థానంలో కొనసాగుతున్నది. కాగా మరో నలుగురు షూటర్లు 72 పాయింట్లతో సమానంగా పతకంకోసం పోటీపడుతున్నారు. మహిళల స్కీట్‌లో రమిత జిందాల్, మెహూలి ఘోష్ 9, 10 స్థానాల్లో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

