Galle | గాలేలో గాలివాన బీభత్సం.. కూలిన స్టాండ్.. లంక-ఆసీస్ టెస్టుకు అంతరాయం
శ్రీలంక-ఆస్ట్రేలియా వేదికగా గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటకు వరుణడు మోకాలడ్డాడు. బుధవారం ప్రారంభమైన ఈ టెస్టులో రెండో రోజు ఆట మరో రెండు గంటల్లో ప్రారంభమవుతుందనగా గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కుండపోతగా వర్షంతో పాటు బలమైన గాలులు వీయడంతో గాలే స్టేడియం అతలాకుతలమైంది.
గాలివాన బీభత్సానికి గాలేలోని టెంపరరీ పెవిలియన్ గా పిలువబడుతున్న గ్రాండ్ స్టాండ్ కూలిపోయింది. అదృష్టవశాత్తూ అది కూలిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. స్టాండ్ కూలడంతో పాటు స్టేడియంలో పలు చోట్ల అద్దాలు కూడా పగిలిపోయాయి.
కాగా వరుణుడు కరుణించిన తర్వాత ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు వచ్చింది. ప్రస్తుతం 32 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. కామెరాన్ గ్రీన్ (8 నాటౌట్), ఉస్మాన్ ఖవాజా (59 నాటౌట్) ఆడుతున్నారు.
అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక.. 59 ఓవర్లలో 212 పరుగులకే ఆలౌట్ అయింది. వికెట్ కీపర్ డిక్వెల్ల (58) ఒక్కడే టాప్ స్కోరర్. పతుమ్ నిస్సంక (23), కెప్టెన్ కరుణరత్నె (28), ఏంజెలొ మాథ్యూస్ (39), ధనుంజయ డి సిల్వ (14) లు విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో లియాన్ కు 5 వికెట్లు దక్కగా.. స్వెప్సన్ మూడు, స్టార్క్, కమిన్స్ తలో వికెట్ పడగొట్టారు.
#Srilanka : Current #weather in Galle Day 2 : The temporary Pavilion at the #Galle International Cricket Stadium has been damaged due to strong winds accompanied by rain. #SLvAUS pic.twitter.com/TJPYfFETr9
— Priyatharshan 🌏 (@priyatharshan1) June 30, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Galle Test
- SL vs AUS
- Sri Lanka
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

