పారిస్ : ఫ్రెంచ్ ఓపెన్లో మూడో రోజు అతి పెద్ద సంచలనం నమోదైంది. పురుషుల విభాగంలో రెండో సీడ్ డేనియల్ మెద్వెదెవ్ 23 ఏండ్ల బ్రెజిల్ యువ ఆటగాడు, 172వ ర్యాంకర్ థియాగో సిబోట్ వైల్డ్ చేతిలో 6-7(5-7), 7-6(8-6), 6-2, 3-6, 4-6 స్కోరుతో ఓటమిపాలై ఇంటిదారి పట్టాడు.
ఇరు విభాగాల్లో టాప్ సీడెడ్లు కార్లొస్ అల్కారజ్ 6-0, 6-2, 7-5తో ఫ్లావియో కొబల్లిపై, స్వియాటెక్ 6-4, 6-0తో స్పెయిన్ క్రీడాకారిణి క్రిస్టినా బక్సాపై గెలుపొంది ముందంజ వేశారు.