లాహోర్ : పాకిస్తాన్ క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్గా వ్యవహరిస్తున్న సౌతాఫ్రికా మాజీ పేసర్ మోర్నె మోర్కెల్ తన పదవికి రాజీనామా చేశాడు. ప్రపంచకప్లో పాకిస్తాన్ నిరాశాజనక ప్రదర్శన నేపథ్యంలో మోర్కెల్ తన ఒప్పందం ముగియకముందే తప్పుకున్నాడు.
ఆరు నెలల కాలానికి గత జూన్లో పాక్ క్రికెట్ బోర్డుతో ఒప్పందం చేసుకున్న మోర్కెల్ అర్ధంతరంగా వైదొలిగాడు. ప్రపంచకప్లో పాకిస్థాన్ అయిదు మ్యాచ్లలో ఓడిపోయి అయిదో స్థానంలో నిలిచి సెమీస్కు అర్హత సాధించలేకపోయింది.