Phani Rao | హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ బ్యాడ్మింటన్ మాజీ రిఫరీ, హైదరాబాద్ బ్యాడ్మింటన్ సంఘం కోశాధికారి కె. ఫణిరావు కన్నుమూశారు. తెలుగు రాష్ర్టాల్లో బ్యాడ్మింటన్ ఆటకు విశేష సేవలు అందించిన ఫణిరావు.. 72 ఏండ్ల వయసులో శుక్రవారం హైదరాబాద్లోని తన నివాసంలో మృతిచెందారు.
ఆయనకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఐదు దశాబ్దాల పాటు బ్యాడ్మింటన్ సంఘం తరఫున వివిధ బాధ్యతలు నిర్వర్తించిన ఫణిరావు మృతి పట్ల తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్) చైర్మన్ ఆంజనేయగౌడ్ సంతాపం తెలియజేశారు. ఆయన మృతి క్రీడాలోకానికి తీరని లోటని పేర్కొన్నారు.