Italy Ex Footballer : ఇటలీకి చెందిన మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు గియన్లుక వియల్లి శుక్రవారం కన్నుమూశాడు. క్లోమగ్రంథి క్యాన్సర్ (పాంక్రియాస్ క్యాన్సర్)తో పోరాడుతున్న ఆయన 58 ఏళ్ల వయసులో ప్రాణాలు విడిచాడు. దాంతో ఇటలీ ఫుట్‌బాల్‌లో విషాదం నెలకొంది. లెజెండ్ రెస్ట్ ఇన్ పీస్ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. 2017లో గియన్లుకకు పాంక్రియాస్ క్యాన్సర్ నిర్ధారణ అయింది. మూడేళ్లు ట్రీట్మెంట్ తీసుకున్నాడు. 2020 ఏప్రిల్‌లో తాను క్యాన్సర్‌ను జయించినట్టు వెల్లడించాడు. అయితే.. 2021 డిసెంబర్లో క్యాన్సర్ తిరగబెట్టిందని గియన్లుక ప్రకటించాడు.
ఇటలీ జాతీయ జట్టుతో పాటు జువెంటస్, చెల్సియా, క్రెమొనెసే, సంప్డోరియా క్లబ్‌లకు కూడా గియన్లుక ఆడాడు. ఇటలీ తరఫున 59 మ్యాచ్‌లు ఆడిన గియన్లుక 16 గోల్స్ చేశాడు. 1996 వరల్డ్ కప్‌లో ఆడాడు. చెల్సియా క్లబ్‌తో చివరి మ్యాచ్ ఆడిన అనంతరం అతను కోచ్‌గా, ఆ క్లబ్ మేనేజర్‌గా అవతారమెత్తాడు.