ఫార్ములావన్ మాజీ బాస్ కన్నుమూత

లండన్: ఫార్ములా వన్ మాజీ చీఫ్ మ్యాక్స్ మోస్లే కన్నుమూశారు. ఆయన వయసు 81 ఏళ్లు. మ్యాక్స్ మోస్లే మృతిపై మాజీ ఎఫ్‌వన్ బాస్ బెర్నీ ఎక్లిస్టోన్ స్పందించారు. తన సోదరుడిని కోల్పోయినట్లు బెర్నీ తెలిపారు. చాన్నాళ్ల నుంచి మోస్లే .. క్యాన్సర్ నుంచి బాధపడుతున్నాడు. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ (ఎఫ్ఐఏ)కు 1993 నుంచి 2009 వరకు నాయకత్వం వహించారు. తనపై తప్పుడు కథనం రాసిన ఓ పత్రిక నుంచి అతను 60 వేల పౌండ్ల నష్టపరిహారాన్ని వసూల్ చేశారు. ఎఫ్ఐఏ అధ్యక్ష పాత్రలో ఫార్ములావన్ ఈవెంట్లో అనేక సంస్కరణలు తీసుకువచ్చాడు. డ్రైవర్ల రక్షణకు మోస్లే ప్రాముఖ్యత ఇచ్చేవారని బెర్నీ తెలిపారు. మోస్తే మృతి తీవ్ర విషాదాన్ని మిగిల్చినట్లు ప్రస్తుత ఎఫ్ఐఏ అధ్యక్షుడు జీన్ టాడ్ ట్వీట్ చేశారు. ఆటో రేసింగ్ క్రీడా ఈవెంట్లను మరో మలుపు తిప్పిన గొప్ప వ్యక్తిని అని ఫ్మారులా వన్ ప్రతినిధి ఒకరు కామెంట్ చేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

