ముషీరాబాద్:తొలిసారి జరుగుతున్న అల్టిమేట్ ఖోఖో లీగ్లో హైదరాబాద్ యువ ప్లేయర్ దాసరి జీవిత్రావు బరిలోకి దిగుతున్నాడు. ఇటీవల జరిగిన వేలం పాటలో చెన్నై క్విక్గన్స్ ఫ్రాంచైజీ జీవిత్రావును ఎంపిక చేసుకుంది. ఆగస్టు 14 నుంచి మొదలవుతున్న ఖోఖో లీగ్లో సత్తాచాటాలన్న పట్టుదలతో కనిపిస్తున్నాడు.