Infantino Out : ఫిఫా ప్రపంచకప్ నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న గియనీ ఇన్ఫాంటినో(Gianni Infantino) పదవీ త్వరలోనే ఊడేలా ఉంది. వివాదాస్పద నిర్ణయాలతో ఈమధ్య తరచూ అభిమానుల ఆగ్రహం చవిచూస్తున్న ఇన్ఫాంటినో రాజీనామా చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. వరల్డ్‌కప్ లాభాలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలనే ఫిఫా చీఫ్ నిర్ణయంపై భగ్గుమంటున్న ఫ్యాన్స్ ప్రపంచవ్యాప్తంగా అతడి రాజీనామా కోసం కదం తొక్కారు.
భవిష్యత్‌లో నిర్వహించే ఫిఫా వరల్డ్‌కప్‌ల ద్వారా వచ్చే లాభాలను ప్రైవేట్ పెట్టుబడుదారులకు ఇవ్వాలనుకుంటున్న గియానీ ఇన్ఫాంటినో ప్రయత్నాలపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్ వ్యక్తులకు లబ్ది చేకూర్చే ఈ నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాకర్ అభిమానులు అతడి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేనా.. గురువారం ఆన్లైన్లో ఇన్ఫాంటినో ఔట్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను మొదలెట్టారు.అంతేకాదు ఫిఫా పాలనా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని, భవిష్యత్‌లో ఇటువంటి వివాదాలను నిలువరించేలా మార్పులు తేవాలని వారు కోరుతున్నారు.
Gianni Infantino is facing fresh opposition as football fan groups from around the world launched an #InfantinoOut petition demanding his resignation as FIFA president. The campaign follows backlash over his proposed commercial spinoff involving future World Cup profits, which… pic.twitter.com/dFlds7ayCQ
— The Daily Jagran (@TheDailyJagran) August 20, 2026
”వరల్డ్ కప్ లాభాలను ప్రైవేట్ పెట్టుబడిదారుల పరం చేయాలని ఫిఫా అధ్యక్షుడు చేసిన ప్రయత్నం నిజంగా సిగ్గుమాలినది. అతడు ఫుట్‌బాల్ ప్రపంచానికి చేయాలనుకున్న ద్రోహం ఎప్పటికీ మర్చిపో. ఫిఫా అధ్యక్షుడిగా అతడు విఫలమయ్యాడు. ప్రజాస్వామ్య పాలనలో అతడికి చోటు లేదు’ అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులు ఇన్ఫాంటినోపై కేసు వేశారు.
Les Irrésistibles Français soutiennent @FansEurope et signent la pétition pour une réforme de la FIFA !
Vous aussi, signez la pétition : https://t.co/Cmjr7zFcfF
Le football mérite mieux. Agissons maintenant. #InfantinoOUT https://t.co/zDepnybXOM
— 𝙸𝚛𝚛𝚎́𝚜𝚒𝚜𝚝𝚒𝚋𝚕𝚎𝚜 𝙵𝚛𝚊𝚗𝚌̧𝚊𝚒𝚜 ⭐️⭐️ (@IF_Supporters) August 20, 2026
తొలిసారి 2016లో ఫిఫా పగ్గాలు అందుకున్న ఇన్ఫాంటినో 2019, 2023లోనూ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. నాలుగేళ్ల పదవీకాలం అంటే.. 2027 వరకూ అతడు పదవిలో కొనసాగనున్నాడు. అయితే.. తన హయాంలో ఫుట్‌బాల్‌ను విస్తరించడం, ఫిఫా వరల్డ్‌కప్‌లో 48 జట్లకు అవకాశమివ్వడం వంటి నిర్ణయాలతో మెప్పించిన ఇన్ఫాంటినో.. లాభాలను ప్రైవేట్ పెట్టుబడుదారులకు ముట్టజెప్పాలనుకోవడం మాత్రం అతడిపై వ్యతిరేకతకు మరింత కారణమవుతోంది.