పంచకుల: మహారాష్ట్రకు చెందిన యువ జిమ్నాస్ట్ సంయుక్త కాలె పతకాల పంట పండిస్తున్నది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో సం యుక్త ఐదు పసిడి పతకాలతో తనకు తిరుగులేదని నిరూపించింది. జిమ్నాస్టిక్స్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరుస్తూ 16 ఏండ్ల సం యుక్త.. హూప్, బాల్, క్లబ్స్, రిబ్బన్ రిథమిక్ ఈవెంట్లలో స్వర్ణ పతకాలను సగర్వంగా ముద్దాడింది. ఈ యువ జిమ్నాస్ట్ పసిడి ప్రదర్శనతో మహారాష్ట్ర (24 స్వర్ణాలు, 24 రజతాలు, 19 కాంస్యాలు) మళ్లీ టాప్‌లోకి దూసుకు రాగా, ఆతిథ్య హర్యానా (23 స్వర్ణాలు, 21 రజతాలు, 29 కాంస్యాలు) రెండో స్థానానికి పడిపోయింది.