సాహో శార్దూల్..
సొంతగడ్డపై ఆడిన తొలి పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్‌లో భారీ స్కోరు చేసిన రైడర్స్.. ఆనక బౌలింగ్‌లో సత్తాచాటి స్టార్లతో నిండి ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరును చిత్తుచేసింది.
- దంచికొట్టిన పేస్ ఆల్‌రౌండర్
- బెంగళూరుపై కోల్‌కతా జయభేరి
- మెరిసిన రహ్మానుల్లా, వరుణ్, నరైన్
సొంతగడ్డపై ఆడిన తొలి పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్‌లో భారీ స్కోరు చేసిన రైడర్స్..
ఆనక బౌలింగ్‌లో సత్తాచాటి స్టార్లతో నిండి ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరును చిత్తుచేసింది. ఐపీఎల్లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్న అఫ్గానిస్థాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ వేసిన పునాదిపై.. శార్దూల్ ఠాకూర్ అదిరిపోయే సౌధం
నిర్మించాడు. బెంగళూరు బౌలర్లను ఊచకోత కోస్తూ జట్టుకు భారీ స్కోరు అందించాడు. నైట్‌రైడర్స్ యజమాని షారుక్ ఖాన్ మైదానంలో సందడి చేయగా.. కోల్‌కతా స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సుయాశ్ శర్మ, సునీల్ నరైన్ వికెట్ల జాతర జరుపుకున్నారు.
కోల్‌కతా: మొదట బ్యాటింగ్‌లో దంచికొట్టిన కోల్‌కతా నైట్ రైడర్స్.. ఆనక బౌలింగ్‌లో సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్లో తొలి విజయం నమోదు చేసుకుంది. గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన పోరులో కోల్‌కతా 81 పరుగుల తేడాతో బెంగళూరుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. శార్దూల్ ఠాకూర్ (29 బంతుల్లో 68; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా.. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (44 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఐపీఎల్లో తొలి హాఫ్‌సెంచరీ నమోదు చేసుకున్నాడు. రింకు సింగ్ (46; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా రాణించడంతో కోల్‌కతా భారీ స్కోరు చేసింది. వందో ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న మిస్సైల్ మ్యాన్ రస్సెల్ (0) గోల్డ్‌న్ డకౌట్‌గా వెనుదిరగగా.. మన్దీప్ సింగ్ (0), కెప్టెన్ నితీశ్ రాణా (1), వెంకటేశ్ అయ్యర్ (3) విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో డేవిడ్ విల్లే, కరణ్ శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో బెంగళూరు 17.4 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటైంది. కెప్టన్ ఫాఫ్ డుప్లెసిస్ (23; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (21; 3 ఫోర్లు), మిషెల్ బ్రాస్‌వెల్ (19) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోగా.. మ్యాక్స్‌వెల్ (5), షాబాజ్ అహ్మద్ (1), దినేశ్ కార్తీక్ (9), ఇంపాక్ట్ ప్లేయర్ అనూజ్ రావత్ (1), హర్షల్ పటేల్ (0) విఫలమయ్యారు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 4, ఇంపాక్ట్ ప్లేయర్ సుయాశ్ శర్మ మూడు వికెట్లు పడగొట్టారు. డేవిడ్ విల్లే (20 నాటౌట్), ఆకాశ్‌దీప్ (17) ఆఖర్లో కాస్త పోరాడినా అప్పటికే ఆలస్యమైపోయింది. శార్దూల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.
ఆరంభం, ముగింపు అదుర్స్..

టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు శుభారంభం దక్కలేదు. ఒక ఎండ్‌లో రహ్మానుల్లా గుర్బాజ్ ధాటిగా ఆడినా.. వెంకటేశ్ అయ్యర్, మన్దీప్ సింగ్, నితీశ్ రాణా విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొడుతున్నా.. రహ్మానుల్లా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దంచికొట్టాడు. అతడికి రింకూ సింగ్ నుంచి చక్కటి సహకారం లభించింది. ఇక కుదురుకున్నట్లే అనుకుంటున్న సమయంలో కరణ్ శర్మ 12వ ఓవర్లో వరుస బంతుల్లో రహ్మానుల్లాతో పాటు రస్సెల్‌ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో కోల్‌కతా 89 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఇక ప్రధాన ఆటగాళ్లు ఎవరూ లేరనుకుంటున్న సమయంలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన శార్దూల్ ఠాకూర్ విశ్వరూపం కనబర్చాడు. ఎదుర్కొన్న తొలి బంతినే బౌండ్రీకి తరలించి తన ఉద్దేశాన్ని చాటిన శార్దూల్. ఆకాశ్ దీప్ ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. బ్రాస్‌వెల్‌కు రెండు సిక్సర్లు రుచి చూపించిన శార్దూల్.. హర్షల్ ఓవర్లో రెండు ఫోర్లు దంచాడు. ఈ క్రమంలో శార్దూల్ 20 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా.. 19వ ఓవర్లో రింకూ సింగ్ 4,6,6 బాది స్కోరును రెండొందలు దాటించాడు. బెంగళూరు బౌలర్లు 23 అదనపు పరుగులు సమర్పించుకోవడం గమనార్హం.
సంక్షిప్త స్కోర్లు
కోల్‌కతా: 204/7 (శార్దూల్ 68, రహ్మానుల్లా 57; డేవిడ్ విల్లే 2/16, కరణ్ శర్మ 2/26), బెంగళూరు: 17.4 ఓవర్లలో 123 ఆలౌట్ (డుప్లెసిస్ 23, కోహ్లీ 21; వరుణ్ చక్రవర్తి 4/15, సుయాశ్ శర్మ 3/30).
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

