Spain Football Chief | స్పెయిన్ ఫుట్‌బాల్ సమాఖ్య చీఫ్‌కు షాక్.. 3 నెలలు సస్పెండ్ చేసిన ఫిఫా
Spain Football Chief : వరల్డ్ కప్ విజేతకు ముద్దు పెట్టిన స్పెయిన్ ఫుట్‌బాల్ సమాఖ్య చీఫ్(Spain Football Chief) లూయిస్ రూబియేల్స్(Luis Rubiales)పై వేటు పడింది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఫెడరేషన్(FIFA) అతడిని 3 నెలల పాటు సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని ఫిఫాకు చెందిన క్రమశిక్షణ కమిటీ చీఫ్ జార్జ్ ఇవాన్ పలాసియో(Jorge Ivan Palacio) తాజాగా ప్రకటించాడు. ఈ సస్పెన్షన్ వెంటనే అమలులోకి రానుందని....
Spain Football Chief : వరల్డ్ కప్ విజేతకు ముద్దు పెట్టిన స్పెయిన్ ఫుట్‌బాల్ సమాఖ్య చీఫ్(Spain Football Chief) లూయిస్ రూబియేల్స్(Luis Rubiales)పై వేటు పడింది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఫెడరేషన్(FIFA) అతడిని 3 నెలల పాటు సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని ఫిఫాకు చెందిన క్రమశిక్షణ కమిటీ చీఫ్ జార్జ్ ఇవాన్ పలాసియో(Jorge Ivan Palacio) తాజాగా ప్రకటించాడు. ఈ సస్పెన్షన్ వెంటనే అమలులోకి రానుందని, ఈ 3 నెలలు ఫుట్‌బాల్ కార్యకలాపాలకు దూరంగా ఉండాల్సిందిగా రూబియేల్స్ను ఫిఫా ఆదేశించింది. ఈ వివాదంపై స్పెయిన్ ఫుట్‌బాల్ సమాఖ్య సభ్యులు న్యాయ పరమైన చర్యలకు సిద్ధమని ప్రకటించారు. అయితే.. ఒక్క రోజైనా గడవక ముందు రూబియేల్స్ సస్పెండ్ కావడం గమనార్హం.
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో(FIFA World Cup 2023) ఇంగ్లండ్‌పై గెలుపొందిన స్పెయిన్ మహిళల జట్టు మైదానంలో సంబురాలు చేసుకుంది. ఆ తర్వాత విజేతలకు మెడల్ ప్రదానం చేశారు. ఆ సమయంలో లూయిస్, జెన్నీని అభినందించి, పెదవులపై ముద్దు పెట్టాడు. ఆ వీడియో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన ప్రజలు కోపంతో ఊగిపోయారు.
అవార్డు ప్రదాన సమయంలో జెన్నీని ముద్దు పెట్టుకున్నరూబియేల్స్

తన అంగీకారం లేకుండానే ముద్దు పెట్టుకున్నాడని మిడ్ ఫీల్డర్ జెన్నిహెర్మొసో(Jenni Hermoso) ఆరోపించింది. దాంతో లూయిస్‌పై భారీగా వ్యతిరేకత రావడంతో ఆ దేశ ఉప ప్రధాని అతడిని రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించాడు. అయితే.. పరస్పర అంగీకారంతోనే ముద్దు పెట్టుకోవడం జరిగిందిని చెప్పిన రూబియేల్స్ మొదట సారీకి నిరాకరించాడు. అయితే.. ప్రజలు, ఫుట్‌బాల్ దిగ్గజాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో సారీ చెప్పాడు. కానీ, రాజీనామా చేసేందుకు మాత్రం అంగీకరించలేదు. ఆ సంఘటనలో తన తప్పేమి లేదని నమ్మబలికాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

