Fawad Alam | ఫ్రాంచైజీకి ఆడేందుకు.. పాకిస్థాన్ జట్టుతో తెగతెంపులు చేసుకున్న స్టార్ బ్యాటర్
Fawad Alam: ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్(Franchise Cricket) జోరు నడుస్తోంది. దాంతో, కాసుల వర్షం కురిపించే ఈ లీగ్స్ కోసం ఆటగాళ్లు జాతీయ జట్టును వీడుతున్న సంఘటనలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. తాజగా పాకిస్థాన్ క్రికెటర్ ఫవాద్ అలం(Fawad Alam) ఈ జాబితాలో చేరాడు. మైనర్ క్రికెట్ లీగ్(Minor League Cricket T20)లో ఆడడం కోసం పాక్ జట్టుతో తెగతెంపులు చేసుకున్నాడు. దాంతో పాకిస్థాన్ క్రికెటర్‌గా...
Fawad Alam: ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్(Franchise Cricket) జోరు నడుస్తోంది. దాంతో, కాసుల వర్షం కురిపించే ఈ లీగ్స్ కోసం ఆటగాళ్లు జాతీయ జట్టును వీడుతున్న సంఘటనలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. తాజగా పాకిస్థాన్ క్రికెటర్ ఫవాద్ అలం(Fawad Alam) ఈ జాబితాలో చేరాడు. మైనర్ క్రికెట్ లీగ్(Minor League Cricket T20)లో ఆడడం కోసం పాక్ జట్టుతో తెగతెంపులు చేసుకున్నాడు. దాంతో పాకిస్థాన్ క్రికెటర్‌గా అతడి 15 ఏళ్ల కెరీర్‌కు ముగిసింది. త్వరలోనే ఫవాద్ అమెరికాలో ‘చికాగో కింగ్స్‌మెన్'(Chicago Kingsmen) టీమ్ తరఫున బరిలోకి దిగనున్నాడు.
ఇప్పటికే పలువురు పాక్ ఆటగాళ్లు అమెరికాలో క్రికెట్ ఆడేందుకు వెళ్లారు. వాళ్లు ఎవరంటే..? సమీ అస్లాం, హమ్మద్ అజాం, సైఫ్ బదర్, మహమ్మద్ మొహ్సిన్ఈమధ్యే మేజర్ టీ20 లీగ్(Major League Cricket) మొదటి సీజన్ పూర్తైన విషయం తెలిసిందే. ఫవాద్ 2007లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. రెండేళ్ల తర్వాత టెస్టుల్లో తొలి మ్యాచ్‌లోనూ సెంచరీతో మెరిశాడు. అయితే.. వరుసగా రెండు మూడు సిరీస్‌లకు సెలెక్టర్లు అతడిని తీసుకోలేదు. దేశవాళీ క్రికెట్లో 55 సగటుతో పరుగులు చేసినా అతడికి జట్టులో చోటు దక్కలేదు.
న్యూజిలాండ్‌పై సెంచరీ తర్వాత ఫవాద్ అభివాదం

ఈమధ్యే 11 ఏళ్ల విరామం తర్వాత ఫవాద్ మళ్లీ టెస్టు మ్యాచ్ ఆడాడు. పునరాగమనంలోనే ఈ స్టార్ ఆటగాడు న్యూజిలాండ్‌పై సెంచరీ కొట్టాడు. కానీ, ఆస్ట్రేలియా సిరీస్‌లో అదే ఫామ్ కొనసాగించలేకపోయాడు. దాంతో, మళ్లీ జట్టుకు దూరమయ్యాడు. ఈ 15 ఏళ్ల కెరీర్లో ఫవాద్ 19 టెస్టులు, 38 వన్డేలు, 24 టీ20లు ఆడాడంతే. టెస్టుల్లో 5 , వన్డేల్లో ఒక శతకం మాత్రమే బాదాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

