Uppal Test | ఉప్పల్ టెస్టు మ్యాచ్లో పోలీసుల భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించింది. భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పోలీసుల కండ్లు కప్పి విరాట్ కోహ్లీ జెర్సీ ధరించిన అభిమాని..మైదానంలో ఉన్న రోహిత్ దగ్గరకు దూసుకెళ్లాడు. రోహిత్ కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించిన అభిమానిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉంటే వెహికిల్ పాస్లు ఉన్నా..స్టేడియంలోనికి అనుమతించే విషయంలో పోలీసులు ఇబ్బందులకు గురిచేశారు. దీనికి తోడు క్యాటరింగ్ వాహనాలకు పాస్ లేవన్న కారణంతో ఆపేయడంతో కార్పొరేట్ బాక్స్ అభిమానులు, మీడియా సిబ్బందికి గంట ఆలస్యంగా భోజనాలు అందాయి.