వికారాబాద్‌లో క్రికెటర్ ఆత్మహత్య
క్రీడల్లో రాణిస్తూ ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్న ఓ మహిళా క్రికెటర్ ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. యువకుల వేధింపుల కారణంగానే ఆమె ప్రాణాలు తీసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా, పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వికారాబాద్ సీఐ రఘుకుమార్, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం..
వికారాబాద్, నవంబర్ 13: క్రీడల్లో రాణిస్తూ ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్న ఓ మహిళా క్రికెటర్ ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. యువకుల వేధింపుల కారణంగానే ఆమె ప్రాణాలు తీసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా, పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వికారాబాద్ సీఐ రఘుకుమార్, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం..
వికారాబాద్ జిల్లా యాలాల మండలం సంగాయిపల్లి తండాకు చెందిన నందిని (19) ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది. అండర్ 19 విభాగంలో క్రికెట్ ఆడుతోంది. వికారాబాద్ పట్టణంలోని మధుకాలనీలో ఉన్న తన మేనమామ రమేష్ ఇంట్లో ఉంటూ సాధన చేస్తోంది. గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నందిని ఫ్యాన్ హుక్కు చున్నీతో ఉరివేసుకుంది. గమనించిన మేనమామ రమేష్ వెంటనే ఆమెను కిందకు దించి దవాఖానాకు తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే నందిని మృతి చెందినట్లు నిర్ధారించారు.
ఇద్దరు యువకుల వేధింపులే కారణమంటూ బంధువుల ఆందోళన
నందిని మృతిపై అనుమానాలు ఉన్నాయని పేర్కొంటూ ఆమె తండ్రి వికారాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ప్రేమించాలంటూ పరిగి ప్రాంతానికి చెందిన కృష్ణ, అనిల్ అనే ఇద్దరు యువకులు గత కొంతకాలంగా తన కూతురిని వెంటపడి వేధిస్తున్నారని, వారి వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
నందిని మృతికి కారణమైన యువకులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు వికారాబాద్‌లోని ఎన్టీఆర్ చౌరస్తాలో ధర్నాకు దిగారు. పోలీసులు నచ్చజెప్పడంతో వారు ఆందోళన విరమించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. దర్యాప్తులో భాగంగా నందిని మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, అందులోని కాల్ వివరాలు, చాటింగ్‌లు ఇతర డిజిటల్ ఆధారాలను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వికారాబాద్‌లో క్రికెటర్ ఆత్మహత్య
Air Purifiers | ఎయిర్ ప్యూరిఫైర్లను ఉపయోగిస్తే షుగర్ లెవల్స్‌ను తగ్గించవచ్చు.. తేల్చి చెబుతున్న వైద్య నిపుణులు..
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
Jayannth & The Jingo Pen | దిల్ రాజు చేతుల మీదుగా ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ నుంచి ‘నా కనుపాపే’ సాంగ్ విడుదల
Vaccine | చిన్నతనంలో కొన్ని టీకాలు వేయించుకోని వారు పెద్దయ్యాక తీసుకోవచ్చా.. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

