న్యూఢిల్లీ: భారత రేసర్ జెహాన్ దారువాలా.. ఫార్ములా-2లో దూసుకెళ్తున్నాడు. వరుస విజయాలతో జోరుమీదున్న జెహాన్.. ఈ సీజన్లో ఆరో పోడియం ఫినిష్ చేసి అదుర్స్ అనిపించుకున్నాడు. ఫ్రాన్స్‌లో ఆదివారం జరిగిన ఫ్యూచర్ రేస్‌లో జెహాన్ రెండో స్థానంలో నిలిచాడు. పదో స్థానం నుంచి రేసును ప్రారంభించిన జెహాన్.. వాయు వేగంతో ప్రత్యర్థులను దాటుకుంటూ రెండో స్థానం దక్కించుకున్నాడు.