FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ 2026 క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా 3-1 తేడాతో స్విట్జర్లాండ్‌పై అద్భుత విజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. నిర్ణీత 90 నిమిషాల సమయం ముగిసేసరికి ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. అర్జెంటీనా తరఫున 10వ నిమిషంలో మ్యాక్ ఆలిస్టర్ గోల్ చేయగా, స్విట్జర్లాండ్ తరఫున 67వ నిమిషంలో డాన్ ఎండోయే గోల్ చేసి స్కోరును సమం చేశాడు.
అయితే, 72వ నిమిషంలో స్విస్ ఆటగాడు బ్రీల్ ఎంబోలో రెడ్ కార్డ్ దాదాపు మ్యాచ్‌ను మార్చేసింది. దీంతో స్విట్జర్లాండ్ 10 మందితోనే ఆడాల్సి వచ్చింది. ఈ అడ్వాంటేజ్‌తో ఎక్స్ట్రా టైమ్‌లో అర్జెంటీనా చెలరేగిపోయింది. 112వ నిమిషంలో జూలియన్ అల్వారీజ్, ఆఖరి నిమిషంలో (120+1′) లౌటారో మార్టినెజ్ చెరో గోల్ చేసి అర్జెంటీనాకు తిరుగులేని విజయాన్ని అందించారు. బుధవారం జరగబోయే హై-వోల్టేజ్ సెమీఫైనల్లో అర్జెంటీనా తమ చిరకాల ప్రత్యర్థి ఇంగ్లాండ్‌తో తలపడనుంది.