ఇస్లామాబాద్ : ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో భాగంగా ఇంగ్లండ్ జట్టు డిసెంబరులో మూడు టెస్టు మ్యాచ్లు ఆడేందుకు పాకిస్తాన్లో పర్యటించనున్నది. తొలి టెస్టు డిసెంబరు 1-5 తేదీలలో రావల్పిండిలో, రెండో టెస్టు డిసెంబరు 9-13 తేదీలలో ముల్తాన్లో, మూడో టెస్టు డిసెంబరు 17-21 తేదీలలో కరాచిలో నిర్వహించనున్నారు.
చివరిసారిగా 2005లో పాకిస్తాన్లో టెస్టు సిరీస్ ఆడిన ఇంగ్లండ్ 17 ఏళ్ల తరువాత మరలా టెస్టు సిరీస్ ఆడనున్నది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో పాకిస్తాన్ అయిదో స్థానంలో, ఇంగ్లండ్ ఏడో స్థానంలో ఉన్నాయి.