T20 World Cup 2024 | ఇంగ్లండ్‌కు పెద్ద షాక్.. వరల్డ్ కప్ ఆడనని చెప్పేసిన స్టోక్స్
T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ ముందు డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్(England)కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్(Ben Stokes) మెగా టోర్నీ నుంచి వైదొలిగాడు. ఈ విధ్వంసక ఆల్‌రౌండర్ పొట్టి...
T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ ముందు డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్(England)కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్(Ben Stokes) మెగా టోర్నీ నుంచి వైదొలిగాడు. ఈ విధ్వంసక ఆల్‌రౌండర్ పొట్టి ప్రపంచకప్ (T20 World Cup 2024) నుంచి స్వచ్చందంగా తప్పుకుంటున్నట్టు తెలిపాడు. ఈ విషయాన్ని మంగళవారం ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డులు వెల్లడించాయి. మోకాలి సర్జరీ నుంచి పూర్తిగా కోలుకోవడంతో పాటు బౌలింగ్‌పై దృష్టి పెట్టేందుకు స్టోక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇంగ్లండ్ జట్టు కీలక ఆటగాడైన స్టోక్స్ 2022 వరల్డ్ కప్‌లో అదరగొట్టాడు. పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో అతడు విన్నింగ్ షాట్ కొట్టాడు. దాంతో, ఇంగ్లీష్ జట్టు రెండోసారి పొట్ ప్రపంచకప్ విజేతగా అవతరించింది. నిరుడు వన్డే వరల్డ్ కప్ తర్వాత స్టోక్స్ మోకాలి సర్జరీ చేయించుకున్నాడు. రెండు నెలల్లోనే కోలుకున్న స్టోక్స్ భారత పర్యటనకు వచ్చాడు.

ధర్మశాల టెస్టులో
అయితే.. స్పెషలిస్ట్ బ్యాటర్‌గానే ఆడిన అతడు.. సిరీస్‌లో చివరిదైన ధర్మశాల టెస్టులో తొలిసారి బౌలింగ్ చేశాడు. మొదటి బంతికే రోహిత్ శర్మను బౌల్డ్ చేసి ఔరా అనిపించాడు. అయితే.. వన్డేలు, టీ20ల కంటే టెస్టులకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చే స్టోక్స్.. మోకాలి సర్జరీ నుంచి పూర్తిగా కోలుకోవడం కోసం బ్రేక్ తీసుకుంటున్నాడు. ఈ ఏడాది జూన్ 1వ తేదీన టీ20 వరల్డ్ కప్ మొదలవ్వనుంది. ఈసారి అమెరికా, వెస్టిండీస్‌లు మెగా టోర్నీకి సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
Sandeep Kumar: 400మీటర్ల స్ప్రింట్‌లో వరల్డ్ రికార్డు.. సందీప్ కుమార్‌కు స్వర్ణ పతకం
Karimnagar | పరారులో భూ మాఫియా!.. ‘నమస్తే’ కథనంతో వెలుగులోకి కోతిరాంపూర్ భూకబ్జా
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

