లండన్: ఇంగ్లండ్ విధ్వంసక ఓపెనర్ అలెక్స్ హేల్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. మూడు ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించాడు. నిరుడు పాకిస్థాన్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో చివరిసారి ఇంగ్లండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హేల్స్..
ఆ తర్వాత తిరిగి జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇంగ్లండ్ తరఫున 11 టెస్టుల్లో 573 పరుగులు చేసిన హేల్స్.. 70 వన్డేల్లో 2419 పరుగులు.. 75 టీ20ల్లో 2074 రన్స్ చేశాడు.