ODI WC 2023 | పాక్, ఇంగ్లండ్ మ్యాచ్ తేదీ మార్చండి.. ఐసీసీ రెక్కీ బృందానికి బెంగాల్ క్రికెట్ సంఘం వినతి
ODI WC 2023 : ఈ ఏడాది వన్డే ప్రపంచ కప్(ODI WC 2023) షెడ్యూల్లో మరిన్ని మార్పులు జరగడం ఖాయం అనిపిస్తోంది. ఇప్పిటికే దాయాదులైన భారత్(India), పాకిస్థాన్(Pakistan) మ్యాచ్ తేదీ ముందు రోజకు మారిన విషయం తెలిసిందే. తాజాగా ఇంగ్లండ్(England), పాకిస్థాన్ మ్యాచ్ తేదీ కూడా మార్చాలని వినతులు వచ్చాయి. ఈరోజు కోల్‌కతాలోని ఈడెన్స్ గార్డెన్...
ODI WC 2023 : ఈ ఏడాది వన్డే ప్రపంచ కప్(ODI WC 2023) షెడ్యూల్లో మరిన్ని మార్పులు జరగడం ఖాయం అనిపిస్తోంది. ఇప్పిటికే దాయాదులైన భారత్(India), పాకిస్థాన్(Pakistan) మ్యాచ్ తేదీ ముందు రోజకు మారిన విషయం తెలిసిందే. తాజాగా ఇంగ్లండ్(England), పాకిస్థాన్ మ్యాచ్ తేదీ కూడా మార్చాలని వినతులు వచ్చాయి. ఈరోజు కోల్‌కతాలోని ఈడెన్స్ గార్డెన్(Edens Garden Stadium)లో ఐసీసీ రెక్కీ బృందం(ICC Recce Team) పర్యటించింది.
నవంబర్ 12న కాలీమాత పూజ ఉందని, భదత్రా కారణాల దృష్ట్యా ఆరోజు జరగాల్సిన ఇంగ్లండ్, పాక్ మ్యాచ్ డేట్ మార్చానలి బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు ఐసీసీ టీమ్‌ను కోరారు. దీనిపై బీసీసీఐ, ఐసీసీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే టీమిండియా, పాకిస్థాన్ మ్యాచ్ తేదీ అక్టోబర్ 14మారింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో అక్టోబర్ 12న జరగాల్సిన శ్రీలంక, పాక్ మ్యాచ్ మ్యాచ్ తేదీ అక్టోబర్ 10 కు షెడ్యూల్ చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచ కప్ ప్రారంభం కానుంది.
వరల్డ్ కప్ ట్రోఫీతో కపిల్ దేవ్

సొంత గడ్డపై మరోసారి ట్రోఫీ సాధించాలని టీమిండియా పట్టుదలతో ఉంది. 2011లో ధోనీ(MS Dhoni) సారథ్యంలోని భారత జట్టు రెండోసారి వన్డే వరల్డ్ కపను సొంతం చేసుకుంది. ఇండియా మొదటిసారి 1983లోవరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడింది. కపిల్ దేవ్(Kapil Dev) బృందం ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌ను ఓడించి సంచలనం సృష్టించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

