FIFA World Cup | అర్జెంటీనాతో సెమీఫైనల్.. మెస్సీ కోసం మాస్టర్ ప్లాన్..!
FIFA World Cup : ఎనిమిది గోల్స్‌తో గోల్డెన్ బూట్ రేసులో ముందున్న అతడికోసం తాము మాస్టర్ ఫ్లాన్‌తో సిద్ధంగా ఉన్నామని ఇంగ్లండ్ మేనేజర్ థామస్ తుచెల్(Thomas Tuchel) వెల్లడించాడు.
FIFA World Cup : ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో స్పెయిన్‌ను ఢీకొనేది ఎవరు? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. రెండో సెమీఫైనల్లో తలపడుతున్న ఇంగ్లండ్(England), అర్జెంటీనా(Argentina).. రెండూ పటిష్టమైన జట్లే కావడంతో టైటిల్ పోరుకు దూసుకెళ్లేది ఎవరు? అనేది ఆసక్తిగా మారింది. డిఫెండింగ్ ఛాంపియన్‌కు చెక్ పెట్టాలంటే లియోనల్ మెస్సీ(Lionel Messi)ని ఇంగ్లండ్ ఆటగాళ్లు నిలువరించాల్సి ఉంటుంది. ఎనిమిది గోల్స్‌తో ‘గోల్డెన్ బూట్’ రేసులో ముందున్న అతడికోసం తాము మాస్టర్ ఫ్లాన్‌తో సిద్ధంగా ఉన్నామని ఆ జట్టు మేనేజర్ థామస్ తుచెల్(Thomas Tuchel) వెల్లడించాడు.
అట్లాంటాలోని మెర్సిడెస్ బెంజ్ స్టేడియంలో ఇంగ్లండ్, అర్జెంటీనా సెమీస్ పోరు జరుగనుంది. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 12:30 గంటలకు మ్యాచ్ మొదలవ్వనుంది. వరసగా రెండోసారి ఫైనల్ ఆడాలనుకుంటున్న అర్జెంటీనాను ఓడించి స్పెయిన్‌తో తలపడాలని ఇంగ్లండ్ వ్యూహాలు రచిస్తోంది. అయితే.. ఫామ్‌లో ఉన్న లియోనల్ మెస్సీని ఆపడమే ఆ జట్టుకు అసలైన సవాల్. తమ ఫార్వర్డ్స్ రాణించినా సరే.. డిఫెండర్లను ఏమారుస్తూ, మెరుపు గోల్స్ చేసే మెస్సీని నిలువరించడంపైనే ఇంగ్లండ్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి.. మెస్సీని అడ్డుకునేందుకు మాస్టర్ ప్లాన్ వేశామని చెబుతున్నాడు మేనేజర్ థామస్ తుచెల్.
“We want to take them down.” 👊
Thomas Tuchel says England are ready for the challenge of Argentina and Lionel Messi 🗣️ pic.twitter.com/XMdsoVlrGO
— Match of the Day (@BBCMOTD) July 14, 2026
‘సెమీఫైనల్లో మెస్సీని ఎలా ఆపాలి? అనేది ఆలోచిస్తున్నా. పాత స్కూల్ పద్ధతిలో మెస్సీని లక్ష్యంగా చేసుకుంటే సరిపోతుంది అనిపిస్తోంది. అయితే.. మ్యాచ్‌లో మేము కచ్చితంగా ఇదే ఆలోచనను అమలు చేస్తామని నేను చెప్పలేను. కానీ, నా మెదడుకు ఇది తట్టింది. మెస్సీ ఎలా గోల్ చేస్తాడు? ఏ ప్రదేశంలో బలంగా ఉంటాడు? అనేవి మాకు తెలుసు. అతడి మ్యాచ్ వీడియోలు చూసి.. అందుకు తగ్గుట్టు ప్రణాళికలు వేస్తున్నాం. డిఫెండింగ్ ఛాంపియన్ మెస్సీతో, అతడి టీమ్‌తో ఆడడం చాలా ప్రత్యేకం.
The first spot in the Final belongs to Spain 🔒#FIFAWorldCup pic.twitter.com/8umlGDZZ2y
— FIFA World Cup (@FIFAWorldCup) July 14, 2026
బంతి అతడి ముందు పడిందంటే.. గ్యాప్స్ చూసి గోల్ పోస్ట్‌వైపు వెళ్తాడు. సరైన సమయం అనిపించగానే తన ఎడమకాలితో బంతిని గోల్‌గా మలుస్తాడు. అందుకని.. అర్జెంటీనా మ్యాచ్‌లు చూసి వారి ఆటను తెలుసుకుంటున్నాం. అయితే.. మెస్సీ ఒకేలా ఆడుతాడని చెప్పలేం. సెమీస్ కాబట్టి.. అతడు కొత్తగా ప్రయత్నించవచ్చు. ఇరుజట్లకు ఇది బిగ్ మ్యాచ్’ అని ఇంగ్లండ్ మేనేజర్ పేర్కొన్నాడు. వరల్డ్ కప్ చరిత్రలో మెస్సీ.. ఇంగ్లండ్‌తో తలపడడం ఇదే మొదటిసారి. మరోవిషయం.. గతంలో ఆ జట్టుపై విజయానికి సెంటిమెంట్‌గా సెమీస్‌లో అర్జెంటీనా తెలుపు, నీలం కాకుండా పూర్తిగా నీలం రంగు జెర్సీతో ఆడనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్‌ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
Obsession | రూ.2500 కోట్లకు పైగా వసూళ్లు.. ఓటీటీలోకి రాబోతున్న ‘అబ్సెషన్ అన్‌కట్ వెర్షన్’
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్‌కు ఓటేసిన బాలెన్ షా..!
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

