ENG vs NED: స్టోక్స్ సెంచరీ.. రాణించిన మలన్.. నెదర్లాండ్స్ ఎదుట భారీ టార్గెట్
ENG vs NED: ఇంగ్లీష్ జట్టు ఓపెనర్ డేవిడ్ మలన్, స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ సెంచరీతో ఆ జట్టు నెదర్లాండ్స్ ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది.
ENG vs NED: నెదర్లాండ్స్‌తో మహారాష్ట్రలోని పూణే వేదికగా జరుగుతున్న 40వ లీగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ చేస్తూ భారీ స్కోరు చేసింది. ఇంగ్లీష్ జట్టు ఓపెనర్ డేవిడ్ మలన్ (74 బంతులలో 87, 10 ఫోర్లు, 2 సిక్సర్లు), స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ (84 బంతుల్లో 108, 6 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 339 పరుగుల భారీ స్కోరు చేసింది. మలన్, స్టోక్స్‌తో పాటు ఆఖర్లో క్రిస్ వోక్స్ (45 బంతుల్లో 51, 5 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులతో ఇంగ్లండ్ భారీ స్కోరు చేయగలిగింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్.. ఏడో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ జానీ బెయిర్ స్టో (15) మరోసారి విఫలమయ్యాడు. కానీ మరో ఓపెనర్ మలన్ మాత్రం ఫోర్లతో విరుచుకుపడ్డాడు. వాన్ బీక్ వేసిన రెండో ఓవర్లోనే హ్యాట్రిక్ ఫోర్లు కొట్టిన మలన్.. ఆర్యన్ దత్ వేసిన మూడో ఓవర్లో కూడా రెండు బౌండరీలు సాధించాడు. వాన్ బీక్ వేసిన 8వ ఓవర్లో మూడు బౌండరీలు బాదాడు. 36 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తిచేసిన మలన్.. రెండో వికెట్ కు జో రూట్ (35 బంతుల్లో 28, 1 ఫోర్) 85 పరుగులు జోడించాడు.
మిడిలార్డర్ విఫలం..
20 ఓవర్లలో 130-2గా ఉన్న ఇంగ్లండ్ స్కోరు.. తర్వాత గాడితప్పింది. వాన్ బీక్ వేసిన 21వ ఓవర్లో తన ట్రేడ్ మార్క్ షాట్ రివర్స్ స్కూప్ ఆడబోయిన రూట్.. క్లీన్ బౌల్డ్ అయ్యాడు. హ్యారీ బ్రూక్ (11) తో పాటు కెప్టెన్ జోస్ బట్లర్ (5) అలా వచ్చి ఇలా వెళ్లారు. మోయిన్ అలీ (4)దీ అదే కథ. వరుసగా వికెట్లు కోల్పోవడంతో స్టోక్స్ కూడా ఆచితూచి ఆడాల్సి వచ్చింది.
స్టోక్స్ – వోక్స్ భాగస్వామ్యం..
192 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను బెన్ స్టోక్స్ ఆదుకున్నాడు. ఏడో స్థానంలో వచ్చిన క్రిస్ వోక్స్‌తో కలిసి ఏడో వికెట్ కు 81 బంతుల్లోనే 129 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 58 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తిచేసిన స్టోక్స్.. ఆ తర్వాత రెచ్చిపోయి ఆడాడు. ఆర్యన్ దత్ వేసిన 45వ ఓవర్లో 4, 6, 6, 6 తో 80లలోకి వచ్చాడు. బస్ డే లీడె వేసిన 47వ ఓవర్లో 4, 6 కొట్టి 90లలోకి వచ్చిన స్టోక్స్.. మరుసటి ఓవర్లో బౌండరీ కొట్టి వరల్డ్ కప్‌లో తన మొదటి సెంచరీని సాధించాడు. 58 బంతుల్లో అర్థ సెంచరీ చేసిన స్టోక్స్.. తర్వాత 50 పరుగులు చేయడానికి 20 బంతులే తీసుకోవడం గమనార్హం. వోక్స్ కూడా లీడె వేసిన 49వ ఓవర్లో 6, 4 కొట్టి 44 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తిచేశాడు. డచ్ బౌలర్లలో లీడె మూడు వికెట్లు తీయగా వాన్ బీక్, ఆర్యన్ దత్‌లు తలా రెండు వికెట్లు తీశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

