Emma Raducanu | యూఎస్ ఓపెన్ ఛాంపియన్ ఎమ్మా రాడుకానుకు కరోనా
Emma Raducanu | యూఎస్ ఓపెన్‌లో సంచలనం.. పిన్న వయసులోనే టైటిల్ ఎగరేసుకుపోయిన బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఎమ్మా రాడుకానుకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె వెల్లడించింది. అబుధాబిలో ఈ వారం ప్రారంభమయ్యే

యూఎస్ ఓపెన్‌లో సంచలనం.. పిన్న వయసులోనే టైటిల్ ఎగరేసుకుపోయిన బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఎమ్మా రాడుకానుకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె వెల్లడించింది. అబుధాబిలో ఈ వారం ప్రారంభమయ్యే ముబాదల వరల్డ్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ఎగ్జిబిషన్ ఈవెంట్లో ఆమె పాల్గొనాల్సి ఉంది. అయితే కరోనా సోకడంతో ఆమె ఈ కార్యక్రమం నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె ప్రకటించింది. 19 ఏళ్ల ఎమ్మా.. ఈ ఈవెంట్లో ఒలింపిక్స్ సింగిల్స్ స్వర్ణపతక విజేత బెలిండా బెన్సిక్‌తో తలపడాల్సి ఉంది.
‘నేను కూడా అభిమానుల ముందు ఈ మ్యాచ్ ఆడాలని ఎంతో ఆశపడ్డాను. కానీ దురదృష్టవశాత్తూ కరోనా పాజిటివ్‌గా రావడంతో మరో అవకాశం కోసం ఎదురు చూడక తప్పడం లేదు’ అని ఎమ్మా చెప్పింది. నిబంధనల ప్రకారం ప్రస్తుతం తను ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఎమ్మా తెలిపింది. ఆమె స్థానంలో పాల్గొనేందుకు మరో స్టార్ టెన్నిస్ ప్లేయర్ కోసం వెతుకుతున్నట్లు కార్యక్రమం నిర్వాహకులు పేర్కొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

