యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన ఎమ్మా రెడుకాను
- ఫైనల్లో ఓడిన లైలా ఫెర్నాండెజ్
అట్టడుగు నుంచి అగ్రస్థానానికి.. అధఃపాతాళం నుంచి శిఖరాగ్రానికి..
మూడు నెలల క్రితం 300వ ర్యాంక్‌లో ఉన్న అమ్మాయి..ఏమాత్రం అంచనాలు లేకుండా క్వాలిఫయర్‌గా న్యూయార్క్ వచ్చిన టీనేజ్ ప్లేయర్..రెండు వారాల వ్యవధిలో గ్రాండ్‌స్లామ్ చరిత్రలోనే పెను సంచలనం సృష్టించింది!
తన విజయంపై నమ్మకం లేక టోర్నీ ముగియడానికి ముందే తిరుగు ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకున్న చిన్నది.. క్వాలిఫయర్‌గా అడుగుపెట్టి గ్రాండ్‌స్లామ్ నెగ్గిన తొలి ప్లేయర్‌గా నయా చరిత్ర లిఖించింది. రెండు దశాబ్దాల తర్వాత ఇద్దరు టీనేజ్ అమ్మాయిల మధ్య జరిగిన గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో లైలాపై ఎమ్మా రెడుకాను విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్,మెద్వెదెవ్ తలపడనుండగా.. మీరు ఈ వార్త చదివే సమయానికి ఫలితం తేలిపోనుంది!

న్యూయార్క్: సీజన్ ముగింపు గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో పెను సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్‌లో క్వాలిఫయర్‌గా అడుగుపెట్టిన ఎమ్మా రెడుకాను (బ్రిటన్) వరుస విజయాలతో టైటిల్ చేజిక్కించుకుంది. క్వాలిఫయర్‌గా ప్రారంభించి గ్రాండ్‌స్లామ్ నెగ్గిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించిన రెడుకాను.. 44 ఏండ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన బ్రిటన్ క్రీడాకారిణిగా రికార్డుల్లోకెక్కింది. 150వ ర్యాంక్‌తో న్యూయార్క్ చేరిన 18 ఏండ్ల రెడుకాను.. తాజాగా విడుదల కానున్న డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో 23వ స్థానానికి ఎగబాకనుంది. టోర్నీ ఆసాంతం ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ఫైనల్ చేరిన రెడుకాను.. శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన తుదిపోరులో 6-4, 6-3తో 73వ ర్యాంకర్ లైలా ఫెర్నాండెజ్ (కెనడా)పై విజయం సాధించింది. క్వాలిఫయింగ్ టోర్నీలో మూడు మ్యాచ్‌లు నెగ్గిన 18 ఏండ్ల ఎమ్మా.. మొయిన్ ‘డ్రా’లో వరుసగా ఏడు మ్యాచ్‌లు నెగ్గి చాంపియన్‌గా అవతరించింది. సోమవారం తెల్లవారేసరికి రెండో ర్యాంకర్ మెద్వెదెవ్ (రష్యా), నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) మధ్య జరుగనున్న పురుషుల సింగిల్స్ ఫలితం తేలనుంది.
హోరాహోరీ..
గ్రాండ్‌స్లామ్ టైటిల్ ఫైట్‌లో ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు తలపడటం రెండు దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి కాగా.. గంటా 51 నిమిషాల పాటు సాగిన పోరులో ఎమ్మా రెడుకాను పూర్తి ఆధిపత్యం కనబర్చింది. ఎమ్మాతో పోల్చుకుంటే క్లిష్టమైన ప్రత్యర్థులను ఓడించి తుదిపోరుకు అర్హత సాధించిన లైలా.. ఫైనల్లో అదే జోరు కొనసాగించలేకపోయింది. ఇద్దరు ప్లేయర్లు చెరో రెండు ఏస్‌లు సంధించినా.. ఎమ్మా రెండు డబుల్ ఫాల్ట్స్ చేస్తే.. లైలా ఐదు తప్పిదాలతో వెనుకబడి పోయింది. 4 బ్రేక్ పాయింట్లు ఖాతాలో వేసుకున్న ఎమ్మా.. ఓవరాల్‌గా 81 పాయింట్లతో విజేతగా నిలిచింది. గంటకు సుమారు 173 కిలోమీటర్ల వేగంతో ఎమ్మా చేసిన సర్వీస్‌లకు ప్రత్యర్థి సరైన బదులు ఇవ్వలేకపోయింది. విజయం అనంతరం చేతిలోని రాకెట్‌ను పక్కన పడేసి నవ్వులు చిందించిన రెడుకాను.. అభిమానుల హృదయాలను గెలుచుకుంది. కరోనా వైరస్ ప్రభావంతో టోర్నీలన్నీ ప్రేక్షకులు లేకుండా ఖాళీ మైదానాల్లో సాగుతున్న సమయంలో.. నిర్వాహకులు ఈ మెగాటోర్నీకి అభిమానులను అనుమతించగా.. ఈ ఇద్దరు టీనేజర్లు వారికి చక్కటి వినోదాన్ని పంచారు.

1 ఓపెన్ ఎరా (1968 తర్వాత)లో క్వాలిఫయర్‌గా బరిలోకి దిగి గ్రాండ్‌స్లామ్ నెగ్గిన తొలి ప్లేయర్ ఎమ్మా రెడుకాను.
వర్జీనియా వేడ్ (1977లో వింబుల్డన్) తర్వాత గ్రాండ్‌స్లామ్ గెలిచిన బ్రిటన్ క్రీడాకారిణిగా ఎమ్మా రెడుకాను రికార్డుల్లోకెక్కింది.
2 షరపోవా (17 ఏండ్ల వయసులో 2004 వింబుల్డన్) తర్వాత పిన్న వయసులో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన రెండో క్రీడాకారిణిగా ఎమ్మా నిలిచింది.
ప్రైజ్‌మనీ
విజేత రూ. 18 కోట్లు
రన్నరప్ రూ. 9 కోట్లు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

