చెన్నై: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ దుమ్మురేపాడు. సౌత్ జోన్‌తో జరుగుతున్న తొలి ఇన్నింగ్స్‌లో స్టార్ బ్యాటర్ 250 రన్స్ చేసి రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ 301 బంతులు ఆడి 27 ఫోర్లు, ఏడు సిక్సర్లు కొట్టాడు. రెండో రోజ బ్యాటింగ్ కొనసాగిస్తున్న ఈస్ట్ జోన్.. తాజా సమాచారం ప్రకారం 134 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 61326 పరుగలు చేసింది. తొలి రోజు 111 పరుగులు చేసిన కెప్టెన్ ఇషాన్.. అదే ఊపులో రెండో రోజు కూడా బ్యాటింగ్ కొనసాగించాడు. కుమార్ కుశాగ్రాతో కలిసి కిషన్ భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ ఇద్దరూ అయిదో వికెట్‌కు 230 రన్స్ జోడించారు. కుశాగ్రా సెంచరీతో కదం తొక్కాడు. 132 బంతుల్లో 8 ఫోర్లు, అయిదు సిక్సర్లతో అతను 101 రన్స్ చేసి ఔటయ్యాడు.
That moment when Ishan Kishan reached 2️⃣5️⃣0️⃣ 👏👏
Scorecard ▶️ https://t.co/KQf5Km69nk#DuleepTrophy | #SZvEZ pic.twitter.com/6YJYiwNtjV
— BCCI Domestic (@BCCIdomestic) September 7, 2026