Dwayne Bravo | ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన డ్వేన్ బ్రావో.. సీఎస్కే బౌలింగ్ కోచ్‌గా కొత్త అవతారం
ఐపీఎల్లో 161 మ్యాచ్‌లు ఆడిన బ్రావో 183 వికెట్లు తీశాడు
Dwayne Bravo : ఐపీఎల్ 2023 సీజన్‌కు వెస్టిండీస్ మరో స్టార్ ఆటగాడు దూరం కానున్నాడు. స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ఈ రోజు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బ్రావో రికార్డు సాధించాడు. అతను ఈ లీగ్‌లో 183 వికెట్లు పడగొట్టాడు. బ్రావో 2022 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు. 2023 ఐపీఎల్ సీజన్ త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో అనుభవజ్ఞుడైన బ్రేవో సేవల్ని సీఎస్కే వినియోగించుకోవాలనుకుంది. అందుకోసం అతడని తమ జట్టు బౌలింగ్ కోచ్‌గా నియమించింది. బ్రావో ట్విట్టర్ వేదికగా ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకుతున్న విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు.
‘టీ 20 లీగ్స్‌లో కెల్లా కష్టమైన ఐపీఎల్లో 15 ఏళ్ల పాటు ఆడాను. ఈ రోజు ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకుతున్నాను. ఈ 15 ఏళ్ల జర్నీ ఎత్తుపల్లాలతో చాలా గొప్పగా సాగింది. ఈ రోజు నాకు, నా కుటుంబానికి, ముఖ్యంగా నా అభిమానులకు విచారకరమైన రోజు. నేను క్రికెట్ ఆడే రోజులు ఇక ముగిసిపోయాయి. బౌలింగ్ కోచ్‌గా కొత్త బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇన్ని రోజులు నాపై ప్రేమ కురిపించి, నాకు మద్ధతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు’ అంటూ ఈ 39 ఏళ్ల క్రికెటర్ ట్వీట్ చేశాడు.
ఐపీఎల్లో 161 మ్యాచ్‌లు ఆడిన బ్రావో 183 వికెట్లు తీశాడు. 1,560 రన్స్ చేశాడు. ఈ లీగ్‌లో అతను 5 అర్థ సెంచరీలు ఉన్నాయి. బ్రావో ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

