Dwaine Pretorius | క్రికెట్‌కు వీడ్కోలు పలికిన దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్
2022లో పాకిస్థాన్‌తో చివరి టీ20 మ్యాచ్ ఆడిన ప్రిటోరియస్
Dwaine Pretorius : దక్షిణాఫ్రికా మరో ఆటగాడు అతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆల్‌రౌండర్ డ్వేన్ ప్రిటోరియస్ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు ఈ రోజు గుడ్ బై చెప్పేశాడు. జాతీయ జట్టు తరఫున మూడు ఫార్మాట్లలో మొత్తం 60 మ్యాచ్‌లు ఆడాడు. టీ20లో ఎక్కువ మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. 30 టీ20లు, 27 వన్డేలు, 3 టెస్టులు ఆడాడు. 1,895 పరుగులు చేయడమే కాకుండా 77 వికెట్లు పడగొట్టాడు. క్రికెట్ నుంచి తప్పుకున్నతర్వాత ఫ్రాంఛైజ్ క్రికెట్ మీద దృష్టి పెట్టనున్నట్టు ప్రిటోరియస్ తెలిపాడు. ‘కొన్ని రోజుల క్రితం నేను నా క్రికెట్ కెరీర్లో కఠిన నిర్ణయం తీసుకున్నా. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నా. నాకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు’ అని ప్రిటోరియస్ వెల్లడించాడు. అంతేకాదు తన క్రికెట్ జర్నీలోని ముఖ్యమైన వ్యక్తులు, సందర్భాలను గుర్తు చేసుకున్నాడు.
‘జట్టులో చోటు కోల్పోయినప్పుడు డూప్లెసిస్ నాకు దన్నుగా నిలిచాడు. నా ఆట మెరుగుపడడంలో అతను ఎంతో సపోర్ట్ చేశాడు. మైదానంలోకి దిగిన ప్రతిసారి అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించాను. పాదాలు, వేళ్లు, కండరాల గాయాలు వేధిస్తున్నా కూడా బరిలోకి దిగాను. డ్రింక్స్ మోశాను. తోటి ఆటగాళ్లకు నావంతు మేరకు సాయం చేశాను’ అని ఈ ఆల్‌రౌండర్ తెలిపాడు.
ఉత్తమ గణాంకాలు నమోదు
ప్రిటోరియస్ పోయిన ఏడాది పాకిస్థాన్‌తో చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. లాహోర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో 17 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. తన కెరీర్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. అంతేకాదు పురుషుల టీ20లో దక్షిణాఫ్రికా బౌలర్ ఉత్తమ ప్రదర్శన ఇతనిదే కావడం విశేషం. ప్రిటోరియస్ 2016లో అంతర్జాతీయ క్రికెట్లో ఆరంగ్రేటం చేశాడు. ఈ ఆల్‌రౌండర్ 2019 వన్డే వరల్డ్ కప్, 2021 టీ20 వరల్డ్ కప్ జట్టులో సభ్యుడు. పోయిన ఏడాది డిసెంబర్ 27న ఫర్హాన్ బెహర్డియెన్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

