Anvay Dravid | భారత అండర్-19 జట్టులో ద్రవిడ్ చిన్నబ్బాయి..!
Anvay Dravid : భారత దిగ్గజం రాహుల్ ద్రవిడ్ (Anvay Dravid) కుమారులు తండ్రి బాటలో వడివడిగా అడుగులు వేస్తున్నారు. పెద్దబ్బాయి సమిత్ జూనియర్ స్థాయిలో, టీ20 లీగుల్లో రాణిస్తుండగా.. చిన్న కుమారుడు అన్వయ్ (Anvay Dravid) అండర్ -19 జట్టులోకి వచ్చేశాడు.
Anvay Dravid : భారత దిగ్గజం రాహుల్ ద్రవిడ్ (Anvay Dravid) కుమారులు తండ్రి బాటలో వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పెద్దబ్బాయి సమిత్ జూనియర్ స్థాయిలో, టీ20 లీగుల్లో రాణిస్తుండగా.. చిన్న కుమారుడు అన్వయ్ (Anvay Dravid) అండర్ -19 జట్టులోకి వచ్చేశాడు. మూడు దశాబ్దాల క్రితం ద్రవిడ్ అండర్ 19లో ఆడగా.. ఇప్పుడు అబ్బాయి అతడి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నాడు. శ్రీలంకతో సిరీస్‌కు ఎంపిక చేసిన స్క్వాడ్‌లో అన్వయ్ చోటు దక్కించుకున్నాడు.
టాపార్డర్ బ్యాటర్, వికెట్ కీపర్ అయిన అన్వయ్ నిరుడు అండర్ -19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీ స్క్వాడ్‌కు ఎంపికయ్యాడు. ఈ ట్రోఫీలో అన్వయ్ టీమ్ సీకి ప్రాతినిధ్యం వహించాడు. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ ట్రోఫీలో చెలరేగిన అన్వయ్‌ను శ్రీలంకకు వెళ్లే భారత అండర్ -19 జట్టు వికెట్ కీపర్‌గా సెలెక్టర్లు ఎంపిక చేశారు. జూలై 4 నుంచి మొదలయ్యే ఈ టూర్లో మూడు వన్డే మ్యాచ్‌లు, రెండు మల్టీ డే గేమ్స్ ఉన్నాయి. వన్డే జట్టుకు యశ్భర్దణ్ సింగ్ చౌహన్ కెప్టెన్‌గా, లక్ష్య రాయ్ చందనీ అతడికి డిప్యూటీగా ఎంపికయ్యారు.
🧱 The Wall’s Legacy Continues: Rahul Dravid’s Son Anvay Earns India U-19 Call-Up
The legacy of Rahul Dravid continues as his son, Anvay Dravid, has been selected for the India U-19 squad for the upcoming Sri Lanka tour. The young batter earned his place through consistent… pic.twitter.com/lXJFtFiETg
— CricOrbit (@THE_TARUN274) June 12, 2026
కర్నాటక క్రికెట్లో సంచలనంగా ప్రశంసలు అందుకుంటున్న తన్వయ్.. విజయ్ మర్చంట్ ట్రోఫీలో టాప్ స్కోర్‌గా నిలిచాడు. ఈ ట్రోఫీలో అతడు ఆరు మ్యాచుల్లో 91.80 సగటుతో మూడు సెంచరీలతో కలిపి 459 పరుగులు సాధించాడు. అంతేకాదు అండర్ -19 వన్డే టోర్నమెంట్లో కర్నాటకకు అన్వయ్ సారథ్యం వహించాడు కూడా. అతడి సోదరుడు సమిత్ ఈమధ్యే ముగిసిన మహారాజా టీ20 ట్రోఫీలో మెరిశాడు.
అండర్ -19 వన్డే స్క్వాడ్ : సాగర్ విర్క్, లక్ష్య రాయ్చందనీ(వైస్ కెప్టెన్), యశ్బర్ధణ్సింగ్ చౌహన్(కెప్టెన్), వినీత్ వీకే, అర్జున్ రాజ్‌పుత్, కుశగ్ర ఓఝా, రజత్ బఘేల్(వికెట్ కీపర్), అన్వయ్ ద్రవిడ్(వికెట్ కీపర్), అన్మోల్జీత్ సింగ్, వుట్కూరి యశ్వీర్, రోహిత్ అనిల్, శవిన్ వీ, కావ్య పరేశ్ పటేల్, మోహిత్ ఉల్వా, ఇషాన్ సూద్.
అండర్ -19 మల్టీ డే స్క్వాడ్ : సాగర్ విర్క్, లక్ష్య రాయ్చందనీ(వైస్ కెప్టెన్), యశ్బర్ధణ్సింగ్ చౌహన్(కెప్టెన్), పటేల్ కుశ్, మనాల్ చౌహన్, కుశగ్ర ఓఘా, మానవ్ కృష్ణ(వికెట్ కీపర్), ఆర్యన్ సందేశ్ సక్పాల్(వికెట్ కీపర్), హేమ్చుదేశన్, బీకే కిశోర్, రోహిత్ అనిల్, కావ్య పరేశ్, ప్రియాన్ష్ సింగ్, ప్రణవ్ రాఘవేంద్ర, చిగురుపతి వెంకట.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
Bottle Cap | వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
రోహిణి కార్తెను తలపిస్తున్న ఎండలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

